ట్రంప్ సహాయకుడిని అమెరికా అధ్యక్షుడిగా చూపిన గూగుల్

ABN , First Publish Date - 2021-03-22T11:23:45+05:30 IST

గూగుల్‌లో అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. తాజాగా గూగుల్‌లో మరో పొరపాటు చోటుచేసుకుంది. అదేంటంటే..

ట్రంప్ సహాయకుడిని అమెరికా అధ్యక్షుడిగా చూపిన గూగుల్

వాషింగ్టన్: గూగుల్‌లో అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. తాజాగా గూగుల్‌లో మరో పొరపాటు చోటుచేసుకుంది. అదేంటంటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు రిచార్డ్ గ్రెనేల్ అనే వ్యక్తి గతంలో సహాయకుడిగా పనిచేశారు. అయితే గూగుల్‌లో రిచార్డ్ గ్రెనేల్ అని టైప్ చేస్తే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు గూగుల్ చెప్పుకొచ్చింది. దీంతో ఈ వార్త ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీనిపై రిచార్డ్ గ్రెనేల్ సైతం తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. తాను అధ్యక్షుడిని కాబట్టి వరుసపెట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ఇస్తానంటూ ఆయన చమత్కరించారు. అంతేకాకుండా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై రిచార్డ్ గ్రెనేల్ సెటైర్లు వేశారు. తాను పడిపోకుండా విమానం మెట్లు ఎక్కుతానంటూ ట్వీట్ చేశారు. జో బైడెన్ ఇటీవల ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కుతూ తూలి పడిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-03-22T11:23:45+05:30 IST