ఎలాన్ మస్క్ ఓ శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తాడు.. మాజీ మహిళా ఉద్యోగి సంచలన వ్యాఖ్య
ABN , First Publish Date - 2021-12-16T02:51:30+05:30 IST
స్పెస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రవర్తనపై ఓ మాజీ మహిళా ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన ఓ శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

వాషింగ్టన్: స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రవర్తనపై ఓ మాజీ మహిళా ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన ఓ శాడిస్ట్ లాగా ప్రవర్తిస్తారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆష్లే కోసాక్ గతంలో స్పేస్ ఎక్స్‌లో ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించింది. అయితే.. సంస్థలోని వాతావరణం నచ్చక తాను రాజీనామా చేశానంటూ ఓ మీడియా సంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.
‘‘అప్పట్లో నాకో బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతడు శాడిస్టులాగా ప్రవర్తిస్తూ నన్ను వేధించే వాడు. ఎలాన్ మస్క్ ప్రవర్తన కూడా అలాగే అనిపిస్తుంది. ఆయన ఉద్యోగుల ముందుంచే లక్ష్యాలను తరచూ మారుస్తుండటంతో ఉద్యోగులు ‘ఇక మా వల్ల కాదు’ అనే స్థితికి చేరుకుంటారు.’’ అని ఆమె కామెంట్ చేసింది. అంతేకాకుండా.. సంస్థలో తాను లైగింక వేధింపులు ఎదుర్కొన్నానని, కొందరు తనను అనుచితంగా తాకారని పేర్కొంది. ఈ విషయాన్ని మానవవనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేదని వాపోయింది. ఈ ఒత్తిడి వాతావరణంలో ఇమడలేకే తాను బయటకు వచ్చేశానని చెప్పుకొచ్చింది.