Viral Video: చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ రూలర్..!
ABN , First Publish Date - 2021-10-31T15:15:46+05:30 IST
యూఏఈ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దుబాయ్ ఎక్స్పో 2020లో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ఘటన చోటు చేసుకుంది.
దుబాయ్: యూఏఈ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దుబాయ్ ఎక్స్పో 2020లో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో యూఏఈ ప్రధాని, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ను కలిసిన ఏడేళ్ల చిన్నారికి సంబంధించనది కావడం విశేషం. ఆ చిన్నారికి దుబార్ రూలర్ అంటే ఎంతో ఇష్టం. ఇటీవల దుబాయ్ ఎక్స్పోకు వెళ్లిన సమయంలో ఆయనను చూసింది. వెంటనే తల్లితో తాను దుబాయ్ రూలర్ను కలవాలని మారం చేసింది. కానీ, అది అంత ఈజీ విషయం కాదని ఆ చిన్నారికి తెలియదు. ఆ సమయంలో చిన్నారి ఏడుస్తూ తల్లితో దుబాయ్ రాజును కలవాలని చెప్పడం వీడియో తీసి సోషల్ మీడియా పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది.
అది చూసిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆ చిన్నారిని కలిసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా ఎక్స్పోకు వెళ్లిన సమయంలో చిన్నారిని కలిశారు. ఆ సమయంలో చిన్నారి ఆనందంతో ఏడుస్తూ వచ్చి దుబాయ్ రూలర్ను పట్టుకోవడం, చిన్నారిని ఆయన ఓదార్చడం తాజాగా నెట్టింట పెట్టిన వీడియోలో ఉంది. తాను ధరించిన బ్యాడ్జ్ తీసి చిన్నారికి తొడిగిన తర్వాత ఆమె నవ్వడంతో ఫొటోలు దిగారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిన్నారి మనసును అర్థం చేసుకుని ఆమె కోరిక తీర్చిన దుబాయ్ రూలర్పై నెటిజన్లు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.
(Video Credit: DUBAI7)