వరంగల్‌లో ఆలయ నిర్మాణానికి తెలంగాణ కల్చరల్ సొసైటీ(సింగపూర్) భారీ విరాళం

ABN , First Publish Date - 2021-12-08T03:30:27+05:30 IST

తెలంగాణ కల్చరల్ సొసైటీ(సింగపూర్) అధ్యక్షులు శ్రీ నీలం మహేందర్ గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం వరంగల్ జిల్లా గురిజాల గ్రామంలో నిర్మిస్తున్న శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి 2లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వడం జరిగింది.

వరంగల్‌లో ఆలయ నిర్మాణానికి తెలంగాణ కల్చరల్ సొసైటీ(సింగపూర్) భారీ విరాళం

తెలంగాణ కల్చరల్ సొసైటీ(సింగపూర్) అధ్యక్షులు శ్రీ నీలం మహేందర్ గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం వరంగల్ జిల్లా గురిజాల గ్రామంలో నిర్మిస్తున్న శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయానికి 2012లో ఒక లక్ష రుపాయలు ఇవ్వడం జరిగింది.  ఇప్పుడు 2లక్షల రూపాయలను ఆలయ చైర్మన్ శ్రీ నీలం మల్లయ్య పటేల్, ప్రధాన కార్యదర్శి గుర్రం నర్సింగం, ఉపాధ్యక్షులు గడ్డం నర్సింగం, సర్పంచ్ మమతా-సదానందం, ఎంపిటిసి  శ్రీలత - రమేష్ గార్లు, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దల సమక్షంలో ఆలయ కమిటీ కి ఇవ్వడం జరిగింది. Updated Date - 2021-12-08T03:30:27+05:30 IST