ఆగ్రహంతో ఊగిపోతున్న ట్రంప్.. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లపై..!
ABN , First Publish Date - 2021-07-08T06:35:12+05:30 IST
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తనపై నిషేధం విధించిన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను కోర్టు మెట్లెక్కించేందకు సిద్ధం అయ్యారని సమాచారం. తప్పుడు కారణాలతో తన

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తనపై నిషేధం విధించిన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను కోర్టు మెట్లెక్కించేందకు సిద్ధం అయ్యారని సమాచారం. తప్పుడు కారణాలతో తనపై నిషేధం విధించారని ఆరోపిస్తూ.. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్, ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సేపై ట్రంప్ కేసు పెట్టేందుకు యోచిస్తున్నారని సంబందిత వర్గాలు తాజాగా తెలిపాయి. కాగా.. అమెరికా క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడికి ట్రంప్ విద్వేషపూరిత వ్యాఖ్యలే కారణమంటూ ట్విట్టర్ ట్రంప్‌పై శాశ్వతంగా నిషేధం విధించాగా ఫేస్‌బుక్ మాత్రం రెండేళ్లపాటు ట్రంప్ అకౌంట్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై ఇటు ఫేస్‌బుక్ కానీ, అటు ట్విట్టర్ కానీ ఎటువంటి కామెంట్ చేయలేదు.