హైదరాబాద్‌ నుంచి మాలేకు డైరెక్ట్ విమాన సర్వీసులు

ABN , First Publish Date - 2021-02-05T13:10:39+05:30 IST

మాల్దీవుల రాజధాని మాలేకు హైదరాబాద్‌ నుంచి నేరుగా విమాన సర్వీ‌స్‌ను గోఎయిర్‌ ప్రారంభించనుంది.

హైదరాబాద్‌ నుంచి మాలేకు డైరెక్ట్ విమాన సర్వీసులు

హైదరాబాద్‌: మాల్దీవుల రాజధాని మాలేకు హైదరాబాద్‌ నుంచి నేరుగా విమాన సర్వీ‌స్‌ను గోఎయిర్‌ ప్రారంభించనుంది. ఈ నెల 11  నుంచి వారానికి నాలుగు రోజుల పాటు ఈ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ విమానం హైదరాబాద్‌ నుంచి ఉదయం 11.30 గంటలకు బయలుదేరి మాల్దీవుల్లోని వెలనా విమానాశ్రయానికి మధ్యాహం 1.30కి చేరుతుంది. తిరిగి 2.30కి బయలుదేరి సాయం త్రం 5.30కి హైదరాబాద్‌ చేరుకుంటుంది. 

Updated Date - 2021-02-05T13:10:39+05:30 IST