అమెరికాలో భారతీయుడికి రెండేళ్ల జైలు శిక్ష!

ABN , First Publish Date - 2021-03-25T00:42:34+05:30 IST

భారత్‌కు చెందిన వ్యక్తికి అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 1200 మంది యూజర్ల మైక్రోసాఫ్ట్ అకౌంట్లను తొలగించిన కేసులో కోర్టు ఈ తీర్పును వెలవరించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి

అమెరికాలో భారతీయుడికి రెండేళ్ల జైలు శిక్ష!

వాషింగ్టన్: భారత్‌కు చెందిన వ్యక్తికి అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 1200 మంది యూజర్ల మైక్రోసాఫ్ట్ అకౌంట్లను తొలగించిన కేసులో కోర్టు ఈ తీర్పును వెలవరించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన దీపాన్షు ఖేర్ ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. కాలిఫోర్నియాలోని కార్ల్స్‌బాడ్ ప్రాంతంలోని మరో కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365కు మైగ్రేట్ అవ్వడం కోసం దీపాన్షు ఖేర్ పని చేస్తున్న కంపెనీ సహాయం కోరింది. ఈ క్రమంలో దీపాన్షు పని చేస్తున్న కంపెనీ యాజమాన్యం సదరు పనులను పర్యవేక్షించేందుకు అతన్ని 2017లో అమెరికాకు పంపింది. అయితే కార్ల్స్‌బాడ్‌లోని కంపెనీకి అతని పనితీరు నచ్చలేదు. ఇదే విషయాన్ని దీపాన్షు యాజమాన్యానికి కూడా తెలిపింది. ఈ క్రమంలో దీపాన్షు 2018 జనవరిలో ఇండియాకు చేరుకున్నాడు. అతను ఇండియాకు వచ్చిన నెలల వ్యవధిలోనే దీపాన్షును అతని యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో కార్ల్స్‌బాడ్‌లోని కంపెనీపై కక్ష్య పెంచుకున్న దీపాన్షు.. దానిపై సైబర్ దాడి చేశాడు. 1200 మంది యూజర్ల మైక్రోసాఫ్ట్ అకౌంట్లను డిలీట్ చేశాడు. దీంతో సదరు కంపెనీ కార్యకలాపాలన్ని నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఆ కంపెనీకి సుమారు 5,67,084 డాలర్ల నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో సదరు కంపెనీ దీపాన్షుపై సైబర్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు దీపాన్షుపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 11న ఓ పనిపై అమెరికా వెళ్లిన దీపాన్షును అమెరికా సైబర్ అధికారులు అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు అవ్వడంతో దీపాన్షుకు కాలిఫోర్నియా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా దీపాన్షు మూలంగా కంపెనీ నష్టపోయిన సొమ్మును చెల్లించాల్సిందిగా అతన్ని కోర్టు ఆదేశించింది. 


Updated Date - 2021-03-25T00:42:34+05:30 IST