బ్రిటన్‌లో మళ్లీ విరుచుకుపడుతున్న మహమ్మారి.. భారీగా రోజువారీ కేసులు!

ABN , First Publish Date - 2021-10-20T13:39:45+05:30 IST

కరోనా తొలినాళ్లలో ఒకసారి.. గతేడాది చివర్లో మరోసారి అతలాకుతలమైన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)ను తాజాగా వైరస్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

బ్రిటన్‌లో మళ్లీ విరుచుకుపడుతున్న మహమ్మారి.. భారీగా రోజువారీ కేసులు!

రోజుకు 50 వేల కరోనా కేసులు 

లండన్‌, అక్టోబరు 19: కరోనా తొలినాళ్లలో ఒకసారి.. గతేడాది చివర్లో మరోసారి అతలాకుతలమైన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)ను తాజాగా వైరస్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దేశంలో రోజుకు దాదాపు 50 వేల కేసులు నమోదవుతున్నాయి. గత మూడు నెలల్లో ఇవే అత్యధికం. ప్రపంచంలో అత్యధిక ఇన్ఫెక్షన్‌ రేటు ఉన్న దేశాల్లో యూకే ఒకటి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వచ్చేది శీతాకాలమని (నవంబరు -మార్చి).. పరిస్థితి ఇలాగే ఉంటే ప్రమాదమేన ని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి వేసవి ప్రారంభమైన జూలై నుంచి యూకేలో ఆంక్షలను సడలించారు. ప్రజలు జా గ్రత్తలు విస్మరించారు. ఇక సెప్టెంబరులో విద్యా సంస్థలను తెరిచినా.. టీనేజీ వారికి టీకా పంపిణీపై యూకే ఎటూ తేల్చుకోలేకపోయింది. ‘‘ప్రస్తుతం యువత ఎక్కువగా వైర్‌స బారిన పడుతున్నారు. వారినుంచి 35-55ఏళ్ల వారికీ సోకుతోంది. వీరిద్వారా 55ఏళ్లు దాటినవారికీ పాకితే ముప్పే’’ అని ఓ నిపుణుడు హెచ్చరించారు. 


మొదట టీకా పొందినవారిలో యాంటీబాడీల క్షీణత

చాలా దేశాల కంటే ముందుగా.. యూకేలో గత డిసెంబరులో వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. పంపిణీ కూడా బాగా జరిగింది. అయితే, 6 నెలలైనందున నాడు టీకా పొందినవారిలో నేడు చాలామందిలో ముఖ్యంగా వృద్ధుల్లో యాంటీబాడీలు క్షీణించాయని, వేసవిలో ఉధృతంగా ఉన్న డెల్టా వేరియంట్‌ కూడా వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని తగ్గించిందని నిపుణులు పేర్కొంటున్నారు. యూర్‌పలోని మిగతా దేశాలతో పోలిస్తే 12-17 ఏళ్ల మధ్యవారికి యూకేలో టీకా పంపిణీ తక్కువగా ఉంది. ఇక్కడ ఎక్కువగా ఆస్ట్రాజెనెకా టీకానే ఇచ్చారు. ఫైజర్‌ టీకాతో పోలిస్తే దీని రక్షణ సామర్థ్యం త్వరగా క్షీణిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే సెప్టెంబరులో 50 ఏళ్లు దాటినవారికి, వైద్య సిబ్బంది, అనారోగ్య సమస్యలున్న వారికి బూస్టర్‌ డోసు ఇవ్వడం ప్రారంభించారు. 65 లక్షల మందికి బూస్టర్‌ అవసరమని అంచనావేయగా.. ఇప్పటికి 36 లక్షల మందికి పంపిణీ చేశారు. హెర్డ్‌ ఇమ్యూనిటీపై ఆశలు పెట్టుకోకుండా.. ఇంకా అసలు టీకా పొందని వర్గాలను గుర్తించి.. అందులోనూ యువతకు ఇవ్వాలని, బూస్టర్‌ను వేగిరం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.


డెల్టా ఉప వర్గాలూ కారణమా?

యూకే ప్రస్తుత పరిస్థితికి డెల్టా వేరియంట్‌ ఉపవర్గాలు కారణమని భావిస్తున్నారు. దేశం లో ఏవై.4.2 డెల్టా ఉపవర్గం వ్యాప్తిలో ఉన్నట్లు గత శుక్రవారం ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇది ఏ222వి, వై145హెచ్‌ ఉత్పరివర్తనాలను కలిగి ఉందని పేర్కొంది. వాస్తవానికి డెల్టా కంటే ఏవై.4.2.. 15ు వేగంగా వ్యాప్తి చెందుతుందనే అంచనాలున్నాయి. 

Updated Date - 2021-10-20T13:39:45+05:30 IST