చైనాలో పెరుగుతున్న కరోనా.. 30మంది అధికారులపై ప్రభుత్వం గుస్సా

ABN , First Publish Date - 2021-08-10T06:16:19+05:30 IST

కరోనా కేసులు తొలిగా వెలుగు చూసిన చైనాలో మరోసారి ఈ మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా డ్రాగన్ కంట్రీలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి.

చైనాలో పెరుగుతున్న కరోనా.. 30మంది అధికారులపై ప్రభుత్వం గుస్సా

బీజింగ్: కరోనా కేసులు తొలిగా వెలుగు చూసిన చైనాలో మరోసారి ఈ మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా డ్రాగన్ కంట్రీలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. వూహాన్‌లో కూడా కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇక్కడ కోటిపైగా కరోనా టెస్టులు కూడా నిర్వహించారు. అయితే ఇలా కరోనా కేసులు పెరగడంతో కొందరు అధికారులపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరిని అసలు ఉద్యోగంలో నుంచి తొలగించగా.. మరికొందరికి ఇతర శిక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఇలా సుమారు 30 మంది ఉన్నతాధికారులను చైనా శిక్షించిందని సమాచారం. వీళ్లంతా తమ తమ పరిధుల్లో వైరస్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. వీరిలో ఒక వైస్ మేయర్, కొన్ని పట్టణాల, హెల్త్ కమిషన్లు అధికారులు, ఆస్పత్రి నిర్వహణా సిబ్బంది, ఎయిర్‌పోర్టు, టూరిజం శాఖల అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా చైనాలో కూడా డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Updated Date - 2021-08-10T06:16:19+05:30 IST