వ్యాక్సిన్ పేటెంట్ మినహాయింపుకు మేం అడ్డులేం: కెనడా

ABN , First Publish Date - 2021-05-09T02:37:41+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌కు పేటెంట్ మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్‌ ఊపందుకుంటున్న తరుణంలో.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక ప్రకటన చేశారు.

వ్యాక్సిన్ పేటెంట్ మినహాయింపుకు మేం అడ్డులేం: కెనడా

ఒట్టావా: కరోనా వ్యాక్సిన్‌కు పేటెంట్ మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్‌ ఊపందుకుంటున్న తరుణంలో.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక ప్రకటన చేశారు. వ్యాక్సిన్ ఐపీ (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ) హక్కులను మినహాయించే విషయంలో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ట్రూడో తెలిపారు. ‘‘ఈ విషయంలో కెనడా జోక్యం చేసుకోవడంకానీ, అడ్డుకోవడం కానీ చేయడం లేదు. కేవలం అందరికీ ఆమోదయోగ్యమైన సమాధానం కోసం కృషి చేస్తున్నామంతే’’ అని ఆయన స్పష్టం చేశారు. కరోనా వైరస్ పేటంట్ మినహాయింపునకు ఇటీవలే అగ్రరాజ్యం అమెరికా కూడా మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.


ఈ క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడిన కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మేరీ ఎన్జీ.. ఐపీని కాపాడాల్సిన ప్రాముఖ్యతను కెనడా బలంగా విశ్వసిస్తుందని తేల్చిచెప్పారు. దీంతో కరోనా వ్యాక్సిన్ పేటెంట్ విషయంలో కెనడా వైఖరి ఇదేనని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రధాని రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు.

Updated Date - 2021-05-09T02:37:41+05:30 IST