బడ్జెట్‌లో ప్రవాసులకు మొండి చెయ్యి

ABN , First Publish Date - 2021-02-02T01:58:24+05:30 IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌లో ప్రవాసీయుల తోడ్పాటుకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం లక్షలాది మంది ప్రవాసీయులను నిరుత్సాహపర్చింది. ద్వంద ప

బడ్జెట్‌లో ప్రవాసులకు మొండి చెయ్యి

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌లో ప్రవాసీయుల తోడ్పాటుకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేకపోవడం లక్షలాది మంది ప్రవాసీయులను నిరుత్సాహపర్చింది. ద్వంద పన్ను విధానం నుంచి మినహాయింపు, ప్రవాసీయులు భారతదేశంలో కంపెనీలను నెలకొల్పేందుకు వెసులుబాటు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని వల్ల దాదాపు 98శాతం మందికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కరోనా కష్టకాలం, ఉద్యోగాల జాతీయకరణలో భాగంగా గల్ఫ్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో స్వదేశానికి తిరిగి వస్తున్న పేద ప్రవాసీయులకు ఉపశమనం కల్గించే విధంగా ఎలాంటి ఉద్దీపన చర్యలను కేంద్రం ప్రకటించలేదు.


 సగటు ప్రవాసీయులకు ప్రయోజనం లేదనే విమర్శలు ఉన్న ప్రవాసీ దివస్ దినోత్సవ నిర్వహణకు మాత్రం బడ్జెట్‌లో రూ.20 కోట్ల కేటాయించారు. సోషల్ మీడియా కాలంలో గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న ప్రవాసీయుల ఫిర్యాదులను పరిష్కరించే దిశగా భారతీయ ఎంబసీలలో ఉద్యోగుల సంఖ్యను పెంచే ప్రతిపాదన కూడా బడ్జెట్‌లో లేదు. ఇక విదేశాంగ వ్యవహారాల శాఖకు కూడా నామమాత్రంగా బడ్జెట్ కేటాయించారు. అంతర్జాతీయంగా చైనా, ఇతర దేశాలతో భారత్ పోటీపడుతోంది. అయితే దీనికి అనుగుణంగా కేటాయింపులు మాత్రం లేవు. భూటాన్‌కు రూ.3వేల కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.900 కోట్ల రూపాయాల సహాయం చేయడానికి కేటాయింపులు చేశారు. 


Updated Date - 2021-02-02T01:58:24+05:30 IST