భారత్‌లో అమ్నెస్టీ మూసివేతపై బ్రిటన్‌ ఆందోళన

ABN , First Publish Date - 2021-03-17T15:18:50+05:30 IST

అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ భారత్‌ విభాగాన్ని మూసివేసి, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై బ్రిటన్‌ ఎగువ సభ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

భారత్‌లో అమ్నెస్టీ మూసివేతపై బ్రిటన్‌ ఆందోళన

లండన్‌, మార్చి 16: అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ భారత్‌ విభాగాన్ని మూసివేసి, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై బ్రిటన్‌ ఎగువ సభ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో స్వ చ్ఛంద సంస్థలు, మేధావులు, ఇతర వర్గాలపై నానాటికీ నిర్బంధం పెరిగిపోతోందన్నారు. ఏప్రిల్లో భారత్‌ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ దగ్గర ఈ అంశాన్ని లేవనెత్తాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు పిలుపునిచ్చారు. సోమవారం లార్డ్‌ రిచర్డ్‌ హారిస్‌ ఈ అంశంపై చర్చను ప్రారంభించారు.  

Updated Date - 2021-03-17T15:18:50+05:30 IST