యూఎస్ కాపిటల్ భవనం వద్ద అలజడి.. ట్రక్కులో బాంబు!

ABN , First Publish Date - 2021-08-20T06:00:37+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో బాంబు వార్త కలకలం సృష్టిస్తోంది. అమెరికాలోని యూఎస్ కాపిటల్ భవనం లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ భవనం వద్ద ఆగివున్న ఓ ట్రక్కులో బాంబు ఉందంటూ పోలీసులకు వచ్చిన సమాచారం ప్ర

యూఎస్ కాపిటల్ భవనం వద్ద అలజడి.. ట్రక్కులో బాంబు!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో బాంబు వార్త కలకలం సృష్టిస్తోంది. అమెరికాలోని యూఎస్ కాపిటల్ భవనం లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ భవనం వద్ద ఆగివున్న ఓ ట్రక్కులో బాంబు ఉందంటూ పోలీసులకు వచ్చిన సమాచారం ప్రస్తుతం అక్కడ అలజడికి కారణమైంది. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సమాచారం వచ్చిన వెంటనే రంగంలోకి దిగి.. పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. ట్రక్కులో నిజంగానే పేలుడు పదార్థాలు ఉన్నాయా.. లేదా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.


Updated Date - 2021-08-20T06:00:37+05:30 IST