బిగ్‌బాస్‌లో కొత్త కాంట్రవర్శీ.. అతడు ఎన్నారై కాదు.. నా భర్తే అంటూ..

ABN , First Publish Date - 2021-12-20T01:32:39+05:30 IST

ఇప్పటివరకూ ఈ రియాలిటీ షోకు సంబంధించిన కాంట్రవర్శీలన్నీ సభ్యుల మధ్య తలెత్తినవే. అయితే.. హిందీ బిగ్‌బాస్ తాజాగా ఓ కొత్త ఒరవడికి నాంది పలికింది. ఈ నయా వివాదానికి కేంద్రం రాఖీ సావంత్ భర్త రితేష్. బిగ్

బిగ్‌బాస్‌లో కొత్త కాంట్రవర్శీ.. అతడు ఎన్నారై కాదు.. నా భర్తే అంటూ..

ఇంటర్నెట్ డెస్క్:  బిగ్ బాస్ రియాలిటీ షో పట్ల ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్! ఇక సభ్యుల మధ్య తలెత్తే కాంట్రవర్శీలు, బేధాభిప్రాయాలు ప్రేక్షకుల ఉత్కంఠను అమాంతం పెంచేస్తుంటాయి. ఏ భాషలోనైనా సరే.. బిగ్ బాస్ ఓ హిట్ టీవీ షో..! అయితే.. ఇప్పటివరకూ ఈ రియాలిటీ షోకు సంబంధించిన కాంట్రవర్శీలన్నీ సభ్యుల మధ్య తలెత్తినవే. అయితే.. హిందీ బిగ్‌బాస్ తాజాగా ఓ కొత్త ఒరవడికి నాంది పలికింది. ఈ నయా వివాదానికి కేంద్రం రాఖీ సావంత్ భర్త రితేష్. బిగ్ బాస్ హౌస్‌లోకి అతడు ఎంటరైన నాటి నుంచే ప్రేక్షకులు అనేక అనుమానాలు లేవనెత్తడం ప్రారంభించారు. అసలు.. అతడు నిజంగా రాఖీ సావంత్ భర్తేనా అని ప్రశ్నిస్తున్న వారు కోకొల్లలు. సరిగ్గా ఇటువంటి టైంలోనే కథ కొత్త మలుపు తిరిగింది. రితేష్ అసలు భార్య తానే అంటూ తాజాగా ఓ మహిళ ముందుకు వచ్చింది. ఇంతటి సంచలన కామెంట్ చేసిన ఆ మహిళ పేరు స్నిగ్ధ. ఆమెకు ఆరేళ్ల వయసున్న ఓ కూతురు కూడా ఉంది. 


ఓ జాతియ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. రాఖీ సావంత్ భర్తగా ప్రేక్షకులకు పరిచయమైన వ్యక్తి వాస్తవానికి తన భర్త అని, అతడి అసలు పేరు  రితేష్ కుమార్ అని చెప్పింది. అంతేకాకుండా.. తమకు ఆరేళ్ల వయసున్న కూతురు కూడా ఉందని చెప్పుకొచ్చింది. తమ ఏడేళ్ల వైవాహిక జీవితంలో అతడు తనను ఎన్నో వేధింపులకు గురి చేశాడని, అతడితో వేగలేక చివరకు గృహ హింస కేసు పెట్టాల్సి వచ్చిందని కూడా చెప్పుకొచ్చింది. అయితే.. బిగ్ బాస్‌ షోలో రాఖీ సావంత్ రితేష్‌ను తన భర్తగా పరిచయం చేయడం చూసి షాకైపోయాని చెప్పిన ఆమె.. రాఖీ మాటలు నమ్మశక్యంగా లేవని కొట్టి పారేసింది. రితేష్ ప్రస్తుతం ఓ ఎన్నారై అని, బెల్జీయంలో ఉంటున్నాడని చెప్పడం వాస్తవం కాదని తేల్చి చెప్పింది. కాగా.. బిగ్ బాస్‌కు మునుపు రాఖీ సావంత్ తన భర్త ఎవరనే విషయాన్ని గోప్యంగానే ఉంచింది. తనకు ఓ ఎన్నారైతో పెళ్లైన విషయాన్ని 2019లో ఓమారు ప్రకటించిన ఆమె..అతడు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇన్నాళ్లకు బిగ్‌బాస్‌షోలో తన భర్త ఎవరో వెల్లడించింది. ప్రస్తుతం వారిద్దరూ హౌస్‌లో సభ్యులుగా ఉన్నారు. దీంతో.. రితేష్ అసలు స్టోరీ ఎంటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. 

Updated Date - 2021-12-20T01:32:39+05:30 IST