వైరల్ అవుతున్న బైడెన్ దంపతుల ఫొటో.. అమ్మబాబోయ్ అంటున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2021-05-05T23:50:12+05:30 IST

అగ్రరాజ్య అధినేత జో బైడన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపట్ల స్పందిస్తున్న నెటిజన్లు.. జో బైడెన్‌తోపాటు ఆయన భార్య జిల్ బైడె

వైరల్ అవుతున్న బైడెన్ దంపతుల ఫొటో.. అమ్మబాబోయ్ అంటున్న నెటిజన్లు!

వాషింగ్టన్: అగ్రరాజ్య అధినేత జో బైడన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపట్ల స్పందిస్తున్న నెటిజన్లు.. జో బైడెన్‌తోపాటు ఆయన భార్య జిల్ బైడెన్‌ను అసాధారణ శక్తిగల వ్యక్తులుగా అభివర్ణిస్తున్నారు. నెటిజన్లు వారిని అలా ఎందుకు అభివర్ణిస్తున్నారనే వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పదవీ బాధ్యతలు స్వీకరించి 100 రోజులు గడిచింది. ఈ సందర్భంగా ఆయన ఓ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో అమెరికా 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ నివాసాన్ని జో బైడెన్ ఆయన భార్య జిల్ బైడెన్ సందర్శించారు. అనంతరం జిమ్మీ కార్టర్ ఆయన భార్య రోసాలిన్ కార్టర్‌తో బైడెన్ దంపతులు ఫొటోలు దిగారు. అందులో ఓ ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.బైడెన్ దంపతులు చాలా పెద్దగా.. జిమ్మీ కార్టర్ దంపతులు మరీ చిన్నగా కనిపిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో దానిపట్ల స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. జిమ్మీ కార్టర్ దంపతులు కుచించుకోయారా లేక.. బైడెన్ దంపతుల శరీర పరిమాణాలు పెరిగిపోయాయా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బైడెన్ దంపతులను అసాధారణమైన శక్తిగల వారిగా అభివర్ణిస్తున్నారు. అయితే కెమెరాలో సెట్టింగ్ చేయడం ద్వారా ఇటువంటి ఫొటోలు తీయెచ్చని ప్రముఖ కెమెరా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

Updated Date - 2021-05-05T23:50:12+05:30 IST