శరణార్థుల విషయమై బైడెన్ కీలక ప్రకటన !

ABN , First Publish Date - 2021-02-05T15:45:42+05:30 IST

శరణార్థుల విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. ఏడాదికి 1.25లక్షల మంది శరణార్థులను అంగీకరించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

శరణార్థుల విషయమై బైడెన్ కీలక ప్రకటన !

ఏడాదికి 1.25లక్షల మంది శరణార్థులను అంగీకరించాలి: బైడెన్ 

వాషింగ్టన్: శరణార్థుల విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. ఏడాదికి 1.25లక్షల మంది శరణార్థులను అంగీకరించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచే దీనిని అమలు చేసే ఈ విషయమై కాంగ్రెస్‌తో బైడెన్ మంతనాలు జరుపుతున్నట్లు వైట్‌హౌస్ వర్గాల సమాచారం. కాగా, ట్రంప్ హయాంలో ఈ పరిమితి కేవలం 15వేలుగా ఉంది. బైడెన్ చెప్పినట్లు ఏడాదికి 1.25లక్షల మంది శరణార్థులను అమెరికా అంగీకరిస్తే ఇది ట్రంప్ హయాంలో జరిగిన దానికి 8 రేట్లు అవుతుంది. అలాగే 1993 తర్వాత ఇదే అత్యధికం కానుంది. కాగా, 1980లో యూఎస్ అత్యధికంగా 2,07,000 మంది శరణార్థులను ఆశ్రయం కల్పించింది. చివరగా 2020లో ఈ సంఖ్య 12వేలుగా ఉంది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిపాలన చివరి ఏడాదిలో అగ్రరాజ్యం 85వేల మంది శరణార్థులను అంగీకరించింది.    

Updated Date - 2021-02-05T15:45:42+05:30 IST