ఆ దేశాల జాబితా నుంచి India ను తొలగించిన Bahrain

ABN , First Publish Date - 2021-09-03T15:30:13+05:30 IST

గల్ఫ్ దేశం బహ్రెయిన్ తాజాగా 'రెడ్ లిస్ట్' దేశాల జాబితాను సవరించింది.

ఆ దేశాల జాబితా నుంచి India ను తొలగించిన Bahrain

మనామా: గల్ఫ్ దేశం బహ్రెయిన్ తాజాగా 'రెడ్ లిస్ట్' దేశాల జాబితాను సవరించింది. దీనిలో భాగంగా భారత్‌తో పాటు పాకిస్థాన్, పనామా, రొమినికన్ రిపబ్లిక్‌ను ఈ జాబితా నుంచి తొలగించింది. అలాగే మరో ఐదు దేశాలను ఈ జాబితాలో చేర్చింది. బోస్నియా, హెర్జెగోవినా, స్లోవేనియా, ఇథియోపియా, కోస్టారికా, ఈక్వెడార్ తాజాగా 'రెడ్ లిస్ట్' దేశాల జాబితాలో చేరాయి. ఈ నెల 3వ తేదీ(శుక్రవారం) నుంచి ఈ దేశాలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయని బహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు.  


ఇక నాన్- రెడ్ లిస్ట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కలిగి ఉంటే వారికి బహ్రెయిన్ బయల్దేరడానికి ముందు పీసీఆర్ టెస్టు అవసరం లేదని తెలిపారు. అయితే, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ తప్పనిసరిగా బహ్రెయిన్ చేరుకున్న తర్వాత పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సిందే. అలాగే ఐదు, పదో రోజున కూడా మళ్లీ టెస్టులు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.   


కాగా, 'రెడ్ లిస్ట్'లో ఉన్న దేశాలతో పాటు 14 రోజుల ముందు ఈ దేశాల ద్వారా ప్రయాణించిన వారికి బహ్రెయిన్‌లో ప్రవేశానికి అనుమతి ఉండదు. ఇక బహ్రెయిన్ 'రెడ్ లిస్ట్' దేశాల జాబితాలో తాజాగా చేరిన ఐదు దేశాలతో పాటు శ్రీలంక, ట్యూనీషియా, జార్జియా, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, నేపాల్, ఇరాన్, ఇరాక్, మలేషియా, వియత్నాం, దక్షిణాఫ్రికా, ఉగాండా, జింబాబ్వే, నమీబియా, మొజాంబిక్, మలావి ఉన్నాయి.

Updated Date - 2021-09-03T15:30:13+05:30 IST