భారత్‌పై ఆస్ట్రేలియా ట్రావెల్ బ్యాన్.. కోర్టుకెక్కిన 73ఏళ్ల వృద్ధుడు!

ABN , First Publish Date - 2021-05-06T02:23:02+05:30 IST

భారత్ నుంచి వచ్చే వారిపై బ్యాన్ విధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బెంగళూరులో నివసిస్తున్న ఓ వ్యక్తి వ్యతిరేకించాడు. అంతేకాకుండా కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో స్పందించి

భారత్‌పై ఆస్ట్రేలియా ట్రావెల్ బ్యాన్.. కోర్టుకెక్కిన 73ఏళ్ల వృద్ధుడు!

సిడ్నీ: భారత్ నుంచి వచ్చే వారిపై బ్యాన్ విధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బెంగళూరులో నివసిస్తున్న ఓ వ్యక్తి వ్యతిరేకించాడు. అంతేకాకుండా కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో స్పందించిన ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు అతని పిటిషన్‌పై అత్యవసర విచారణకు ఆదేశించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా సెకండ్ వేవ్‌తో భారత్‌లో పరిస్థితి దయనీయంగా మారింది. ప్రతిరోజు లక్షల మంది కొవిడ్ బారినపడుతుండగా.. వేలాది మంది ఊపిరి వదిలేస్తున్నారు. ఈ క్రమంలో పలు దేశాలు భారత్ నుంచి రాకపోకలకను నిలిపి వేశాయి. ఆస్ట్రేలియా కూడా భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది.


అంతేకాకుండా భారత్ నుంచి వచ్చే దేశ పౌరులపై బ్యాన్ విధించింది. ఇండియాలో 14 రోజుల పాటు ఉన్న ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలోకి అడుగు పెడితే ఐదేళ్ల పాటు జైలుశిక్ష, భారీ జరిమానా(రూ.49లక్షల వరకు) విధిస్తామని హెచ్చరించింది. మే 3 నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుందని వెల్లడించింది. కాగా.. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. మిత్రపక్షాలు సైతం ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని వెనక్కి తగ్గారు. భారత్ నుంచి వచ్చే స్వదేశీ పౌరులకు జైలు శిక్ష విధిస్తమన్న మాటను వెనక్కి తీసుకున్నారు. కానీ భారత్ నుంచి రాకపోకలను పునరుద్దరించే అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో బెంగళూరులో నివస్తున్న ఓ 73ఏళ్ల వ్యక్తి ఆస్ట్రేలియాలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించాడు. కొద్ది రోజుల క్రితం తాను భారత్ వచ్చానని.. తిరిగి ఆస్ట్రేలియాకు వద్దామని అనుకుంటున్నాని పిటిషన్ ద్వారా కోర్టుకు తెలిపారు. ట్రావెల్ బ్యాన్‌ను వ్యతిరేకించిన ఆయన.. ప్రభుత్వ నిర్ణయం తన ప్రయాణానికి అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు స్పందించింది. సదరు పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరిపేందుకు అంగీకరించింది. రాబోయే 24-48 గంటల్లో తదుపరి విచారణ తేదీని నిర్ణయించాలని జస్టిస్ స్టీఫెన్ బర్లీ ఆదేశించారు. కాగా.. కోర్టు ఆర్డర్‌పై మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశాలు తక్కవగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. ఆసీస్ క్రికెటర్లు, ప్రముఖులోపాటు దాదాపు 9వేల మంది ఆస్ట్రేలియా పౌరులు భారత్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. 


Updated Date - 2021-05-06T02:23:02+05:30 IST