46 ఏళ్ల ఆంటీ.. చీరకట్టులో స్కేటింగ్..
ABN , First Publish Date - 2021-06-30T16:53:43+05:30 IST
ఏజ్ 46.. స్టిల్ యంగ్ అంటున్న ఆంటీ.. అనడమే కాదు.. చీరకట్టులో స్కేటింగ్ చేసి...
ఏజ్ 46.. స్టిల్ యంగ్ అంటున్న ఆంటీ.. అనడమే కాదు.. చీరకట్టులో స్కేటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టొరంటోకు చెందిన 46 ఏళ్ల ఊర్బీరాయ్ చీర కట్టులో స్కేటింగ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఏజ్ బార్ అయిపోయిందనుకునేవారికి ఆమె స్ఫూర్తిగా నిలుస్తోంది. తాను స్కేటింగ్ చేస్తున్న వీడియోను ఇన్‌ష్టాగ్రామ్‌లో ‘ఆంటీ స్కేట్స్’ అన్న పేరుతో పోస్టులు చేస్తూ మిగతావారిలో స్ఫూర్తి నింపుతోంది.