'ఆటా' ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఘనంగా దసరా వేడుకలు
ABN , First Publish Date - 2021-10-20T14:30:16+05:30 IST
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో దసరా వేడుకలను వైభవంగా నిర్వహించారు. అక్టోబర్ 17వ తేదీన న్యూజెర్సీలోని ఎడిసన్, రాయల్ గ్రాండ్ మనోర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి న్యూజెర్సీ, పొరుగు రాష్ట్రాల నుండి దాదాపు 1000 మందికి పైగా తెలుగువారు కుటుంబంతో సహా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ విజయ్ కృష్ణన్, ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల విచ్చేశారు.

న్యూజెర్సీ: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో న్యూజెర్సీలో దసరా వేడుకలను వైభవంగా నిర్వహించారు. అక్టోబర్ 17వ తేదీన న్యూజెర్సీలోని ఎడిసన్, రాయల్ గ్రాండ్ మనోర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి న్యూజెర్సీ, పొరుగు రాష్ట్రాల నుండి దాదాపు 1000 మందికి పైగా తెలుగువారు కుటుంబంతో సహా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ విజయ్ కృష్ణన్, ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల విచ్చేశారు. దీపాన్ని వెలిగించి దుర్గా పూజతో వేడుకలను ప్రారంభించారు. ఆ తర్వాత దుర్గామాత పల్లకీ ఊరేగింపు జరిగింది.
కోవిడ్ మహమ్మారి తరువాత యూఎస్‌లో అతిపెద్ద దసరా వేడుకలు కావడంతో పొరుగు రాష్ట్రాల నుండి అనేక మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కోవిడ్ మార్గదర్శకాలు అనుసరించి ఈ కార్యక్రమాన్ని జరిపారు. వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆటా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘువీరారెడ్డి, జాయింట్ కోశాధికారి విజయ్ కుందూర్ బోర్డ్ ట్రస్టీలు శరత్ వేముల, శ్రీనివాస్ రెడ్డి దార్గుల, రవీందర్ రెడ్డి గూడూరు, పరుశురాం పిన్నపురెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. న్యూజెర్సీ ఆర్సీలు ప్రవీణ్ అలా, ప్రదీప్ కట్టా, సంతోష్ కోరం, ఉమెన్స్ కమిటీ అడ్వయిజర్ ఇందిరా శ్రీరామ్ రెడ్డి నేతృత్వంలోని లేడీస్ టీమ్ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడటంతోపాటు, ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. మన సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు ధరించి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించిన కళాకారులను అందరూ అభినందించారు.
ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాలా మాట్లాడుతూ.. వచ్చే సంవత్సరం జూలై 1-3 తేదీల్లో వాషింగ్టన్ డీసిలో జరగబోయే ఆటా మెగా కన్వెన్షన్‌కు అందరూ రావాలని స్వాగతించారు. ఆటాలో జీవితకాల సభ్యత్వం తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను కూడా ఆయన వివరించారు. అలాగే ఆటా నిర్వహించే కమ్యూనిటీ, ఇతర సేవా కార్యక్రమాలను కూడా తెలియజేశారు. అత్యవసర సేవల విభాగమైన ఆటా సేవను అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.
కన్వెన్షన్ కన్వీనర్ సుధీర్ బండారు మాట్లాడుతూ, వచ్చే జూలైలో జరిగే కన్వెన్షన్‌కు అందరూ హాజరై విజయవంతం చేయాలని అభ్యర్థించారు. పలువురు కమ్యూనిటీ నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నాటా మాజీ అధ్యక్షుడు రాజేష్ గంగసాని బోర్డ్ ట్రస్టీలు హరి వెల్కూర్, శరత్ మందడి, అంజన్ కర్నాటి, అన్న రెడ్డి, శ్రీకాంత్ పెనుమాడ, తానా నాయకురాలు లక్ష్మి దేవినేని, జనార్దన్ నిమ్మలపూడి, రాజా కసుకుర్తి, రత్నశేఖర్ మూల్పూరి, వంశీ వాసిరెడ్డి, విద్యాగారపాటి ధ్రువ చౌదరి, శ్రీనివాస్ ఓరుగంటి, శ్రీ చౌదరి, టీటీఏ అధ్యక్షుడు మోహన్ పట్లోళ్ల, కన్వీనర్ శ్రీనివాస్ గనగోని, శివారెడ్డి, టీఫాస్ నాయకులు, కళాభారతి బృందం, సభ్యులు పాల్గొన్నారు.
ఈ ఈవెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేయడానికి న్యూజెర్సి ఆటా టీమ్ చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. దీప్తి, రాజేష్ తమ గాన మాధుర్యంతో అందరినీ పరవశింపజేశారు. ఆటా మాజీ అధ్యక్షులు సుధాకర్ పెర్కారి, డాక్టర్ రాజేందర్ జిన్నా, పరమేష్ భీంరెడ్డి, ఆటా ధర్మకర్తల మండలి సభ్యులు రఘువీరారెడ్డి, విజయ్ కుందూర్, పరుశురాం పిన్నపురెడ్డి, శరత్ వేముల, శ్రీనివాస్ దార్గుల, రవీందర్ గూడూరు, రవి పట్లోల, వినోద్ కోడూరు, సురేష్ జిల్లా(సలహాదారు), శ్రీకాంత్ గుడిపాటి (కార్పొరేట్ చైర్), మహేందర్ ముసుకు (కన్వెన్షన్ అడ్వైజర్), రామ్ వేముల, కృష్ణ ద్యాప, రాజ్ చిలుముల, విజయ్ గంగుల, మహీ సన్నప్రరెడ్డి, విలాస్ జంబుల, రమేష్ మాగంటి, కే రత్నాకర్, మాధవి అరువ, ఇందిరా శ్రీరామ్, దీపిక బుజాల, నందిని దార్గుల, అర్చన వేముల, శిల్పి కుందూర్, మాధవి గూడూర్, నిహారిక గుడిపాటి, దివ్య అలా, రమ్య కోరం, చిత్ర జంబుల, ఉషా కట్ట, గీతారెడ్డి, స్వప్న అలతి, దీపా కోడూరు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అట్లాంటా నుండి అనిల్ బొద్దిరెడ్డి (బీఓటీ), 2022 కన్వెన్షన్ టీమ్ నుండి రవి చల్లా, హనిమి రెడ్డి, డెలావేర్ నుండి హను తిరుమల్, కిరణ్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.
