Kuwait లో కొత్త మాగ్నెటిక్ విధానం.. 2.50లక్షల మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌లకు ఎసరు

ABN , First Publish Date - 2021-12-15T14:04:02+05:30 IST

దేశంలో రోజురోజుకు భారీగా పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కువైత్ సర్కార్ ఇప్పటికే పలు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది.

Kuwait లో కొత్త మాగ్నెటిక్ విధానం.. 2.50లక్షల మంది ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్స్‌లకు ఎసరు

కువైత్ సిటీ: దేశంలో రోజురోజుకు భారీగా పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కువైత్ సర్కార్ ఇప్పటికే పలు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని మరింత కఠినతరం చేసింది. అందులోనూ ప్రవాసులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే విషయంలో కువైత్ గతకొంత కాలంగా కఠిన ధోరణిని అవలంభిస్తోంది. దీంతో ఆ దేశంలో వలసదారులు మునుపటిలా సులువుగా డ్రైవింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఇప్పుడు లేదు. ఇక తాజాగా అంత అంతర్గత మంత్రిత్వ శాఖ పాత చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌లను కొత్త మాగ్నెటిక్ వాటితో భర్తీ చేయడం ప్రారంభించింది. ఈ ప్రక్రియ మూడు నెలల్లో పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. 


ఈ ప్రక్రియలో పలు కారణాల వల్ల ప్రవాసుల సుమారు 2.50 లక్షల చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు కానున్నాయి. తప్పుడు సమాచారంతో లైసెన్స్ పొందడం,వృత్తి మార్పు, కువైత్‌ను శాశ్వతంగా విడిచిపెట్టడం వంటి తదితర కారణాలను ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జారీ చేయబడిన మొత్తం డ్రైవింగ్ లైసెన్స్‌ల సంఖ్య 3 మిలియన్లకు పైగా ఉన్నట్లు అంచనా. ఈ చెల్లుబాటు అయ్యే వాటి నుండి కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు భర్తీ చేయబడతాయని అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-15T14:04:02+05:30 IST