బీబీసీ భవంతి అనుకొని.. పాత భవంతిపైకి దూసుకెళ్లిన నిరసనకారులు

ABN , First Publish Date - 2021-08-10T05:30:00+05:30 IST

బ్రిటన్ రాజధాని లండన్‌లో కొంతమంది నిరసనకారులు పొరపాటు పడ్డారు. వ్యాక్సిన్ వ్యతిరేకంగా వాళ్లంతా నిరసన చేస్తున్నారు.

బీబీసీ భవంతి అనుకొని.. పాత భవంతిపైకి దూసుకెళ్లిన నిరసనకారులు

లండన్: బ్రిటన్ రాజధాని లండన్‌లో కొంతమంది నిరసనకారులు పొరపాటు పడ్డారు. వ్యాక్సిన్ వ్యతిరేకంగా వాళ్లంతా నిరసన చేస్తున్నారు. వ్యాక్సిన్‌ను వ్యతిరేకిస్తూ పలు దేశాల్లో ఇలా ప్రజలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో కూడా ఇలాంటి నిరసనలు షరా మామూలైపోయింది. ఈ క్రమంలోనే బ్రిటన్‌లో కూడా ఇలాంటి నిరసన జరిగింది. ఇక్కడ నిరసన చేసిన వ్యాక్సిన్ వ్యతిరేకులు.. ప్రఖ్యాత బీబీసీ ఛానెల్‌ భవనంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కరోనా వ్యాక్సిన్‌కు బీబీసీ ప్రచారం చేస్తోందని వాదించిన నిరసనకారులు ఆ భవనంలోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇక్కడే ఒక పొరపాటు జరిగింది. వీళ్లందరూ బీబీసీ ఛానెల్ భవనం అనుకొని వేరే భవనంలోకి దూసుకెళ్లారు. ఆ భవనంలో పదేళ్ల క్రితం బీబీసీ కార్యకలాపాలు జరిగేవి. అది పాతపడిపోవడంతో ఈ ఛానెల్ అక్కడి నుంచి మారిపోయింది. ఈ విషయం తెలియని నిరసనకారులు.. బీబీసీ పాత భవనంలోకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న పోలీసులతో వాళ్లు ఘర్షణ పడుతున్న వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Updated Date - 2021-08-10T05:30:00+05:30 IST