సూపర్ మార్కెట్‌లో మహిళ చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్లు..!

ABN , First Publish Date - 2021-12-09T02:16:41+05:30 IST

సూపర్ మార్కెట్‌లో ఓ మహిళ చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో పట్ల స్పందిస్తున్న నెటిజన్లు.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తు కామెంట్లు పెడుతున్నారు.

సూపర్ మార్కెట్‌లో మహిళ చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్లు..!

ఎన్నారై డెస్క్: సూపర్ మార్కెట్‌లో ఓ మహిళ చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో పట్ల స్పందిస్తున్న నెటిజన్లు.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తు కామెంట్లు పెడుతున్నారు. దీంతో విషయం కాస్తా.. ఆ సూపర్ మార్కెట్ యజమాని దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో స్పందించిన యజమాని.. ఇటువంటి పనులు మానుకోవాలని హితవు పలికారు. కాగా.. ఇంతకూ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


అమెరికాలోని నాష్‌విల్లే‌లో ఉన్న సూపర్ మార్కెట్‌ను లిబ్బి అనే మహిళ తాజాగా సందర్శించింది. ఈ నేపథ్యంలో ఆమె.. ఓ బంగాళదుంప చిప్స్ ప్యాకెట్‌ను తెరిచి అందులోంచి ఒకటి తీసుకుని రుచి చూసింది. రుచి నచ్చకపోవడంతో ప్యాకెట్‌లో ఉమ్మి మళ్లీ సీల్ చేసే ప్రయత్నం చుసింది. అంతేకాకుండా  సీల్ చేసిన వాటర్ బాటిల్ నుంచి కూడా సిప్ తీసుకొని దానిని తిరిగి షెల్ఫ్‌లో ఉంచింది. ఆ తర్వాత టాయిలెట్ పేపర్‌తో నాలుక తుడుచుకుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి.. ఆమెను చూసి దొంగగా భావిస్తాడు. దొంగతనం చేయడానికి వచ్చావా అంటూ అని అడగడంతో ఆమె అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా.. లిబ్బి చేసిన పనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాకు చేరడంతో.. నెటిజన్లు స్పందిస్తూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ వీడియో.. సూపర్ మార్కెట్ యజమాని దృష్టికి వెళ్లడంతో.. దర్యాప్తు ఆదేశించారు. విచారణలో చిప్స్ ప్యాకెట్, వాటర్ బాటిల్, టాయిలెట్ పేపర్‌ను లిబ్బి కొనుగోలు చేసినట్టు తేలడంతో.. ఫన్ కోసం లిబ్బి ఇలా చేసి ఉంటుందని సదరు యజమాని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఇలాంటి చేయడం వల్ల షాప్‌నకు చెడ్డ పేరు వస్తుందని.. ఇటువంటి పనులు మానుకోవాలంటూ ఆమెకు హితవు పలికారు.       


Updated Date - 2021-12-09T02:16:41+05:30 IST