టెన్న‌సీలో విమాన ప్ర‌మాదం.. ఏడుగురి మృతి!

ABN , First Publish Date - 2021-05-30T17:48:53+05:30 IST

అమెరికాలోని టెన్న‌సీలో ఓ చిన్న విమానం స‌ర‌స్సులో కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు చ‌నిపోయిన‌ట్లు స‌మాచారం. వివ‌రాల్లోకి వెళ్తే.. ఏడుగురు ప్రయాణిస్తున్న సెస్నా సీ501 అనే అనే జెట్ విమానం టెన్న‌సీలోని పెర్సీ ప్రీస్ట్​ స‌ర‌స్సులో కుప్ప‌కూలింది.

టెన్న‌సీలో విమాన ప్ర‌మాదం.. ఏడుగురి మృతి!

టెన్న‌సీ: అమెరికాలోని టెన్న‌సీలో ఓ చిన్న విమానం స‌ర‌స్సులో కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో  ఏడుగురు చ‌నిపోయిన‌ట్లు స‌మాచారం. వివ‌రాల్లోకి వెళ్తే.. ఏడుగురు ప్రయాణిస్తున్న సెస్నా సీ501 అనే అనే జెట్ విమానం టెన్న‌సీలోని పెర్సీ ప్రీస్ట్​ స‌ర‌స్సులో కుప్ప‌కూలింది. శనివారం ఉదయం 11 గంటలకు(అమెరికా కాల‌మానం ప్ర‌కారం) ఈ ప్రమాదం జరిగిన‌ట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వెల్ల‌డించింది. ఇక స్థానికుల ద్వారా స‌మాచారం అందుకున్న రూథర్‌ఫోర్డ్ కౌంటీ రెస్క్యూ సిబ్బంది వెంట‌నే ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్నాయి. మృతదేహాల కోసం గాలిస్తున్నాయి. కాగా, ఈ ఘటనలో ఎవరూ బతికి ఉన్నట్లు అనిపించడం లేదని రూథర్‌ఫోర్డ్ కౌంటీ ఫైర్ రెస్క్యూ కెప్టెన్ జాషువా సాండర్స్ తెలిపారు. ఇక టెన్నెస్సీ సరస్సు బోటింగ్, ఫిషింగ్​కు ప్రసిద్ధి అని తెలుస్తోంది.       

Updated Date - 2021-05-30T17:48:53+05:30 IST