యువకుడిని మట్టికరిపించిన 75ఏళ్ల బామ్మపై విరాళాల జల్లు!

ABN , First Publish Date - 2021-03-24T23:16:51+05:30 IST

ఏడు పదుల వయసులో 39ఏళ్ల యువకుడిని మట్టికరిపించిన బామ్మపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు సుమారు రూ. 6.7కోట్లు

యువకుడిని మట్టికరిపించిన 75ఏళ్ల బామ్మపై విరాళాల జల్లు!

వాషింగ్టన్: ఏడు పదుల వయసులో 39ఏళ్ల యువకుడిని మట్టికరిపించిన బామ్మపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాకుండా భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు సుమారు రూ. 6.7కోట్లు సమకూరినట్టు గోఫండ్‌మీ వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. శాన్‌ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో రోడ్డుపై నిల్చున్న చైనాకు చెందిన 75ఏళ్ల జియావో జెన్ జీ ముఖంపై శ్వేతజాతికి చెందిన స్టీవెన్ జెంకిన్స్ అకస్మాత్తుగా పిడుగుద్దులు కురిపించాడు. ఈ క్రమంలో స్పిందించిన జియోవో జెన్ జీ.. అతనిపై విరుచుకుపడింది. పక్కనే ఉన్న ఓ కర్ర సహాయంతో అతని భరతం పట్టింది. దీంతో సదరు యువకుడు ఆసుపత్రి పాలయ్యాడు. కాగా.. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ అయింది. దీంతో నెటిజన్లు.. స్వీవెన్ జెంకిన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. జియావో జెన్ జీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో విరాళాలను సేకరించే గోఫండ్‌మీ స్పందించింది. బామ్మ కోసం విరాళాల సేకరణను ప్రారంభిచింది. తాజాగా విరాళాలకు సంబంధించిన కీలక విషయాన్ని ప్రకటిచంది. విరాళాల రూపంలో ఇప్పటి వరకు రూ.6.7కోట్ల పోగయ్యాయని తెలిపింది. కాగా.. దీనిపై బామ్మ స్పందించారు. ఆసియా-అమెరికన్ సమాజాన్ని ప్రభావితం చేసే జాత్యహంకారాన్ని అంతం చేయడానికి ఈ డబ్బును విరాళంగా ఇవ్వాలని జి చెప్పారు. ఇదిలా ఉంటే.. కరోనా విజృంభణ మొదలైన సమయం నుంచి ఆసియన్ అమెరికన్లపై దాడులు పెరిగిపోయిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-03-24T23:16:51+05:30 IST