పోలీసు అధికారిపై నెటిజన్ల ప్రశంసల వర్షం

ABN , First Publish Date - 2021-08-20T22:50:16+05:30 IST

అమెరికాకు చెందిన ఓ పోలీసు అధికారికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు సదరు పోలీసు అధికారిని ‘హీరో’గా అభివర్ణిస్తున్నారు

పోలీసు అధికారిపై నెటిజన్ల ప్రశంసల వర్షం

న్యూయార్క్: అమెరికాకు చెందిన ఓ పోలీసు అధికారికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు సదరు పోలీసు అధికారిని ‘హీరో’గా అభివర్ణిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏం జరిగిందో తెలియదు కానీ న్యూయార్క్‌కు చెందిన జెస్సీ బ్రాంచ్ అనే 60ఏళ్ల వ్యక్తి రైలు పట్టాలపై పడిపోయాడు. ట్రైన్ సమీపిస్తున్నప్పటికీ అతను పట్టాలపై నుంచి లేవలేకపోయాడు. దీంతో లూపెన్ లోపేజ్ అనే పోలీసు అధికారి రంగంలోకి దిగాడు. పట్టాలపైకి దూకి.. జెస్సీని ఫ్లాట్‌ఫాంపైకి తీసుకొచ్చాడు. అనంతరం కొన్ని క్షణాల్లోనే ఆ పట్టాలపైకి రైలొచ్చింది. కాగా.. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. దీంతో పట్టాలపైకి జంప్ చేసి మరీ.. వృద్ధుడి ప్రాణాలను కాపాడిన పోలీసు అధికారిపై నెటిజన్లు ప్రశంసలు కరిపిస్తున్నారరు.


Updated Date - 2021-08-20T22:50:16+05:30 IST