Florida లో దారుణం.. తన మాజీ లవర్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడని క్లాస్‌మేట్‌ను హత్య చేసిన టీనేజర్!

ABN , First Publish Date - 2021-10-31T18:50:48+05:30 IST

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో దారుణం జరిగింది. తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో శృంగారంలో పాల్గొన్నాడని క్లాస్‌మేట్‌ను ఓ టీనేజర్ అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు.

Florida లో దారుణం.. తన మాజీ లవర్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడని క్లాస్‌మేట్‌ను హత్య చేసిన టీనేజర్!
మృతుడు గ్రాంట్‌తో ఇన్‌సైట్‌లో నిందితులు..

మిరామర్, ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో దారుణం జరిగింది. తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో శృంగారంలో పాల్గొన్నాడని క్లాస్‌మేట్‌ను ఓ టీనేజర్ అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఫ్లోరిడాలోని మిరామర్‌లో అక్టోబర్ 17న ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో టీనేజర్‌తో పాటు అతనికి సహకరించిన ఇద్దరు అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడిని 18 ఏళ్ల డ్విగ్ గ్రాంట్‌గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. మిరామర్‌లో నివాసం ఉండే డ్విగ్ గ్రాంట్‌ను నిందితుడు 17 ఏళ్ల టీనేజర్ ఈ నెల 17న పక్కా ప్లాన్ ప్రకారం అతని ఇంటికి వెళ్లి కలిశాడు. ఆ సమయంలో గ్రాంట్‌ను తన మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో ఎందుకు శృంగారంలో పాల్గొన్నావని నిలదీశాడు. దానికి గ్రాంట్.. ఆమె ఇష్టపూర్వంగా తామిద్దరం ఒకటయ్యామని చెప్పాడు. దాంతో అక్కడి నుంచి వచ్చేసిన నిందితుడు.. తాను ప్రస్తుతం ప్రేమిస్తున్న అమ్మాయితో గ్రాంట్‌కు ఫోన్ చేయించాడు. 


ఆమె గ్రాంట్‌ను సెక్స్ ఆశచూపి తన ఇంటికి రమ్మని పిలిచింది. దాంతో గ్రాంట్ ఆమె ఇంటికి వెళ్లాడు. కానీ, అప్పటికే ఆమె ఇంట్లో ఉన్న నిందితుడు.. గ్రాంట్ మెట్లు ఎక్కుతున్న సమయంలో వెనక నుంచి కత్తితో దాడి చేశాడు. పలుమార్లు మెడపై దాడి చేయడంతో గ్రాంట్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం తన లవర్‌తో కలిసి గ్రాంట్ మృతదేహాన్ని మిరామర్‌లోని అతని ఇంట్లో పడేసి వచ్చేశారు. ఇంట్లో రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్న గ్రాంట్‌ను చూసి అతని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆ ప్రాంతంలో రికార్డైన సీసీటీవీ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా నిందితుడైన 17 ఏళ్ల టీనేజర్‌తో పాటు అతనికి సహకరించిన అమ్మాయిని, గ్రాంట్ ఎఫైర్ పెట్టుకున్న మరో అమ్మాయిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముగ్గురు మైనర్లు కావడంతో వారిని జువెనైల్ జైలుకు తరలించారు. వారు కనీసం మూడేళ్లు జైలులో ఉండాలని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2021-10-31T18:50:48+05:30 IST