క్రిస్మస్ ట్రీకి నిప్పంటుకోవడంతో ఇల్లంతా దగ్ధం.. తండ్రీ కుమారుల మృతి

ABN , First Publish Date - 2021-12-27T02:20:03+05:30 IST

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో క్రిస్మస్ దినాన ఘోరం జరిగింది. క్రిస్మస్ ట్రీకి అనూహ్యంగా నిప్పంటుకోవడంతో తండ్రీ కుమారులు మరణించారు.

క్రిస్మస్ ట్రీకి నిప్పంటుకోవడంతో ఇల్లంతా దగ్ధం.. తండ్రీ కుమారుల మృతి

ఇంటర్నెట్ డెస్క్:  అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో క్రిస్మస్ దినాన ఘోరం జరిగింది. క్రిస్మస్ ట్రీకి అనూహ్యంగా నిప్పంటుకోవడంతో తండ్రీ కుమారులు మరణించారు.  మంటలు క్షణాల్లో వ్యాపించి వారి ఇల్లంతా దగ్ధమైపోయిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఇంటి యజమాని ఎరిక్ కింగ్(41), ఆయన ఇద్దరు కుమారులు లియమ్, ప్యాట్రిక్ అక్కడికక్కడే అసువులు మరణించారు. ఎరిక్ పెద్దకొడుకు బ్రేడీ, ఆయన భార్య మాత్రమే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో తప్పించుకోగలిగారు. క్రిస్మస్ ట్రీకి నిప్పంటుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ చెట్టుకు అమర్చిన మంటల కారణంగా ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-27T02:20:03+05:30 IST