అమెజాన్‌లో లక్షన్నర ఉద్యోగాలు.. గంటకు రూ.1351 వేతనం

ABN , First Publish Date - 2021-10-20T02:57:45+05:30 IST

అమెరికాలో హాలీడే సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. కస్టమర్ల తాకిడిని తట్టుకునేందుకు వీలుగా సీజనల్ ఉద్యోగ నియామకాల్ని చేపట్టేందుకు సిద్ధమైంది.

అమెజాన్‌లో లక్షన్నర ఉద్యోగాలు.. గంటకు రూ.1351 వేతనం

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో హాలీడే సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. కస్టమర్ల తాకిడిని తట్టుకునేందుకు వీలుగా సీజనల్ ఉద్యోగ నియామకాల్ని చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మారు ఏకంగా లక్షన్నర ఉద్యోగుల్ని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోనున్నట్టు పేర్కొంది. ఒక్క కాలిఫోర్నియా రాష్ట్రంలోనే 23 వేల మందిని ఉద్యోగంలోకి తీసుకోనున్నట్టు ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు.. కస్టమర్లు ఆర్డరిచ్చిన వస్తువుల ప్యాకింగ్, తరలించడం, షిప్పింగ్ చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి అమెజాన్ గంటకు 18 డాలర్లు(రూ. 1351) వేతనంగా ఇవ్వనుంది. 


ఉద్యోగులు తాము పనిచేస్తున్న ప్రాంతం, షిఫ్టుల ఆధారంగా మరో మూడు డాలర్ల వరకూ అదనంగా పొందొచ్చు. అంతేకాకుండా..సైనింగ్ ఆన్ బోసన్ కింద మరో 3000 వేల డాలర్ల వరకూ ఇస్తామని అమెజాన్ ప్రకటించింది.  ‘‘సీజనల్ నియామకాలతో అమెజాన్ తన కస్టమర్లకు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుంటుంది. కస్టమర్ల షాపింగ్ ఆర్డర్లు అధికంగా ఉండే సమయాల్లో మా సంస్థల్లోని పూర్తి స్థాయి ఉద్యోగులకూ సౌకర్యంగా ఉంటుంది.’’ అని అమెజాన్ గ్లోబల్ కస్టమర్ ఫుల్‌ఫిల్మెంట్ విభాగం ఉపాధ్యక్షురాలు అలీషియా బోలర్ డేవిస్ పేర్కొన్నారు. కొందరు ఉద్యోగులు ఈ తాత్కాలిక ఉపాధిని శాశ్వత సంపాదనా మార్గంగా మలుచుకుంటారని కూడా పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-20T02:57:45+05:30 IST