ఢిల్లీ-మాస్కో మధ్య విమాన సర్వీసులపై ఏరోఫ్లోట్ కీలక ప్రకటన!

ABN , First Publish Date - 2021-02-05T23:29:36+05:30 IST

రష్యాలో పర్యటించడం కోసం వేచి చూస్తున్న భారతీయులకు శుభవార్త. ఈనెల 14 నుంచి ఢిల్లీ-మాస్కో మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి ఢిల్లీ-మాస్కోల మధ్య విమాన సర్వీ

ఢిల్లీ-మాస్కో మధ్య విమాన సర్వీసులపై ఏరోఫ్లోట్ కీలక ప్రకటన!

న్యూఢిల్లీ: రష్యాలో పర్యటించడం కోసం వేచి చూస్తున్న భారతీయులకు శుభవార్త. ఈనెల 14 నుంచి ఢిల్లీ-మాస్కో మధ్య విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి ఢిల్లీ-మాస్కోల మధ్య విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్టు రష్యాకు చెందిన ఏరోఫ్లోట్ విమానయాన సంస్థ ప్రకటించింది. ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా.. 293సీట్ల సామర్థ్యం ఉన్న ఏ330 విమానాన్ని ఇరు దేశాల మధ్య నడపనున్నట్టు వెల్లడించింది. వారంలో రెండు రోజులు (సోమవారం, శనివారం) మాత్రమే విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ సర్టిఫికేట్ పొందిన వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతించనున్నట్టు పేర్కొంది.ఈ సందర్భంగా ఏరోఫ్లోట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఎయిర్ బబుల్ ఒప్పందలో భాగంగా  ఢిల్లీ-మాస్కోల మధ్య వారంలో రెండు రోజులు మా విమాన సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. అత్యధిక డిమాండ్ ఉన్న రూట్లలో మాస్కో-ఢిల్లీ రూట్ కూడా ఉంది. కొవిడ్-19 నేపథ్యంలో ఏర్పడ్డ లాక్‌డౌన్ తర్వాత.. ఢిల్లీ-మాస్కో మధ్య తిరిగి విమాన సర్వీసులు అందుబాటులోకి రావడాన్ని శుభ సంకేతంగా భావించొచ్చు’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. అన్ని కేటగిరీలకు సంబంధించిన వీసాల జారీని తిగిరి ప్రారంభిస్తున్నట్టు ఢిల్లీలోని రష్యా ఎంబసీ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.  

Updated Date - 2021-02-05T23:29:36+05:30 IST