టూరిస్టులకు ఫ్రీ వ్యాక్సిన్ అందిస్తున్న యూఏఈ

ABN , First Publish Date - 2021-06-23T04:15:31+05:30 IST

తమ దేశం చూడటానికి వచ్చే పర్యాటకులకు ఉచితంగా వ్యాక్సిన్ అందివ్వాలని యూఏఈ నిర్ణయించింది. ఈ క్రమంలోనే యూఏఈ రాజధాని అబుధాబిలో టూరిస్టుల కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను తెరిచింది.

టూరిస్టులకు ఫ్రీ వ్యాక్సిన్ అందిస్తున్న యూఏఈ

అబుధాబి: తమ దేశం చూడటానికి వచ్చే పర్యాటకులకు ఉచితంగా వ్యాక్సిన్ అందివ్వాలని యూఏఈ నిర్ణయించింది. ఈ క్రమంలోనే యూఏఈ రాజధాని అబుధాబిలో టూరిస్టుల కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ కేంద్రాలను తెరిచింది. వీటిలో పర్యాటకులకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తారట. అబుధాబి నుంచి వీసాలు పొందిన వాళ్లు, విజిటింగ్ వీసాకు అర్హత ఉన్న పాస్‌పోర్టుదారులకు ఇక్కడ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తారని అధికారులు తెలిపారు. అబుధాబి నుంచి యూఏఈలోకి ప్రవేశించే వాళ్లు ఉచితంగా వ్యాక్సిన్ పొందడం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఇప్పటి వరకూ యూఏఈలోని జనాభాలో సుమారు 85 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-06-23T04:15:31+05:30 IST