ఒమైక్రాన్ ఎఫెక్ట్.. డిసెంబర్ 26 నుంచి అబుధాబిలో అమల్లోకి వచ్చిన కొత్త మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2021-12-27T16:21:29+05:30 IST

కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. కొవిడ్ ఆంక్షలను తిరిగి అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అబుధాబి కీలక ని

ఒమైక్రాన్ ఎఫెక్ట్.. డిసెంబర్ 26 నుంచి అబుధాబిలో అమల్లోకి వచ్చిన కొత్త మార్గదర్శకాలు

ఎన్నారై డెస్క్: కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. కొవిడ్ ఆంక్షలను తిరిగి అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అబుధాబి కీలక నిర్ణయం తీసుకుంది. సభలు, సమావేశాలు, వేడుకలు జరుపుకునే వారిని ఉద్దేశిస్తూ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆదివారం నుంచే ఆ రూల్స్ అమలులోకి వచ్చినట్టు తెలిపింది. ఇళ్లలో చేసుకునే వేడుకులను కేవలం 30 మందితో మాత్రమే జరుపుకోవాలని అబుధాబి ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ కమిటీ ప్రజలకు సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో జరుపుకునే వేడుకలు, సమావేశాలకు గరిష్టంగా 150 మందికి మించి హాజరుకావొద్దని తెలిపింది. అలాగే ఇండోర్ ఈవెంట్లలో 50 మంది పాల్గొనొచ్చని పేర్కొంది. కార్యక్రమాల్లో భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని సూచించింది. ఈ మార్గదర్శకాలు డిసెంబర్ 26 నుంచే అమలులోకి వస్తాయని ఆదివారం స్పష్టం చేసింది. ప్రజలందరూ కొవిడ్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరింది.  
Updated Date - 2021-12-27T16:21:29+05:30 IST