శ్రీలంకలో పనిచేస్తున్న 92 మంది భారతీయులకు కరోనా

ABN , First Publish Date - 2021-06-22T04:42:03+05:30 IST

ద్వీపదేశం శ్రీలంకలో పని చేస్తున్న భారతీయులకు కరోనా సోకింది. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మొత్తం 92 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చిందని శ్రీలంక ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

శ్రీలంకలో పనిచేస్తున్న 92 మంది భారతీయులకు కరోనా

కొలంబో: ద్వీపదేశం శ్రీలంకలో పని చేస్తున్న భారతీయులకు కరోనా సోకింది. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మొత్తం 92 మంది భారతీయులకు కరోనా పాజిటివ్ వచ్చిందని శ్రీలంక ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఫ్యాక్టరీలో మొత్తం 194 మంది ఉద్యోగాలు చేస్తున్నట్లు సమాచారం. వీరిలో మొత్తం 128 మందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరిలో 92 మంది భారతీయులే కావడం గమనార్హం. ఇంతమందికి కరోనా వైరస్ సోకడంతో ఫ్యాక్టరీని తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కరోనా సోకిన వారేకాక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులు కూడా క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు.

Updated Date - 2021-06-22T04:42:03+05:30 IST