యూఎస్‌లో కరోనా విలయం.. రెండు వారాల్లో 50 వేల మరణాలు
ABN , First Publish Date - 2021-02-06T13:11:34+05:30 IST
ఓవైపు టీకా పంపిణీ, మరోవైపు పాజిటివ్‌లు తగ్గుతున్నా.. అమెరికాలో రోజువారీ కరోనా మరణాలు 3 వేలపైనే ఉంటున్నాయి.

వాషింగ్టన్: ఓవైపు టీకా పంపిణీ, మరోవైపు పాజిటివ్‌లు తగ్గుతున్నా.. అమెరికాలో రోజువారీ కరోనా మరణాలు 3 వేలపైనే ఉంటున్నాయి. అగ్రరాజ్యంలో బుధవారం 3,912 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండువారాల్లోనే 50 వేల మంది చనిపోయారు. అమెరికాలో జనవరి 12న అత్యధికంగా 4,466 మంది మృతి చెందారు. ముఖ్యంగా కాలిఫోర్నియాలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. రోజుకు 500 మందిపైనే మృత్యువాత పడుతున్నారు. కెంటకీ, నార్త్ కరోలినా, దక్షిణ కరోలినా, ఒక్లహామా, టెన్నెస్సీల్లోనూ మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. మరోవైపు ప్రజలు కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ.. సామూహిక కార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొంటుండటం ఆందోళన కలిగిస్తోంది.