పోప్‌కు వచ్చిన లేఖలో మూడు బుల్లెట్లు

ABN , First Publish Date - 2021-08-10T11:03:51+05:30 IST

ప్రపంచంలోని క్యాథలిక్ క్రిస్టియన్లందరికీ పూజ్యుడైన పోప్ ఫ్రాన్సిస్‌కు ఇటీవల ఎవరో ఒక లెటర్ పంపారు. ఆ లెటర్‌లో మూడు బుల్లెట్లు ఉన్నట్లు

పోప్‌కు వచ్చిన లేఖలో మూడు బుల్లెట్లు

రోమ్: ప్రపంచంలోని క్యాథలిక్ క్రిస్టియన్లందరికీ పూజ్యుడైన పోప్ ఫ్రాన్సిస్‌కు ఇటీవల ఎవరో ఒక లెటర్ పంపారు. ఆ లెటర్‌లో మూడు బుల్లెట్లు ఉన్నట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. ఇటలీలోని రోమ్‌ పోలీసులు ఈ విషయాన్ని బయటపెట్టారు. పోప్ ఫ్రాన్సిస్‌కు వచ్చిన ఒక లేఖలో మూడు తుపాకీ తూటాలు ఉన్నాయని సోమవారం నాడు పోలీసులు చెప్పారు. మిలాన్ సిటీకి సమీపంలోని ఒక మెయిల్ సార్టింగ్ (లెటర్లను క్రమపద్ధతిలో అమర్చే ప్రాంతం) సదుపాయంలో ఈ లెటర్‌ను అధికారులు వశం చేసుకున్నారు. ఈ లేఖ ప్రపంచ ఫ్యాషన్ పుట్టినిల్లు ఫ్రాన్స్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే వాటికన్‌లో ఆర్థిక విధానాల గురించి ఈ లేఖలో ఒక సందేశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ విషయంపై వాటికన్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.

Updated Date - 2021-08-10T11:03:51+05:30 IST