UAE Golden Visa: దుబాయ్‌లో ప్రారంభమైన '24x7 సర్వీస్'
ABN , First Publish Date - 2021-07-08T16:45:40+05:30 IST
ఇటీవల రెసిడెన్సీ వీసా, ఇతర సేవల కోసం యూఏఈ ప్రకటించిన 'యూ ఆర్ స్పెషల్'(మీరు మాకు ప్రత్యేకం) 24x7 సర్వీసును జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారీన్ అఫైర్స్(జీడీఆర్ఎఫ్ఏ) బుధవారం దుబాయ్‌లో ప్రారంభించింది.

దుబాయ్: ఇటీవల రెసిడెన్సీ వీసా, ఇతర సేవల కోసం యూఏఈ ప్రకటించిన 'యూ ఆర్ స్పెషల్'(మీరు మాకు ప్రత్యేకం) 24x7 సర్వీసును జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారీన్ అఫైర్స్(జీడీఆర్ఎఫ్ఏ) బుధవారం దుబాయ్‌లో ప్రారంభించింది. రెసిడెన్సీ సర్వీసుల కోసం సంస్థలు, పౌరులు, నివాసితులు వ్యక్తిగతంగా వారంలో ఏడు రోజులు 24 గంటల పాటు 'యూ ఆర్ స్పెషల్' ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాటు తమ సందేహలను నివృత్తి చేసుకోవచ్చని జీడీఆర్ఎఫ్ఏ పేర్కొంది. అలాగే దరఖాస్తు స్టేటస్‌ను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలును ఈ 24x7 సర్వీస్ కల్పిస్తుంది. వినియోగదారులకు మరింత సులభంగా రెసిడెన్సీ వీసా సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 'యూ ఆర్ స్పెషల్' సర్వీసును ప్రారంభించినట్లు జీడీఆర్ఎఫ్ఏ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు.
ఈ సర్వీసు 10వేల కంటే ఎక్కువ స్పాన్సర్డ్ ఉద్యోగులు గల సంస్థలకు, గోల్డెన్ వీసా యజమానులకు, నాలుగు నుంచి ఐదు స్టార్ల హోటళ్లకు, లగ్జరీ హోటల్ అపార్ట్‌మెంట్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జీడీఆర్ఎఫ్ఏ వెల్లడించింది. నిర్ణీత సమయంలో రెసిడెన్సీకి సంబంధించిన పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ సర్వీసును తీసుకురావడం జరిగింది. యూఏఈ అధ్యక్షుడు, ప్రధాని, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సూచన మేరకు 'యూ ఆర్ స్పెషల్'(మీరు మాకు ప్రత్యేకం) 24x7 సర్వీసును ప్రారంభించిన్నట్లు జీడీఆర్ఎఫ్ఏ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మర్రి వెల్లడించారు.