12 కంపెనీలపై ‘హెచ్1-బీ అనర్హత’ వేటు.. జాబితాలో తెలుగువారి సంస్థలు
ABN , First Publish Date - 2021-08-14T13:19:14+05:30 IST
అమెరికాలో వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్1-బీ వీసాల విషయంలో 12 కంపెనీలపై అనర్హత వేటు పడింది.
వాషింగ్టన్, ఆగస్టు 13: అమెరికాలో వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్1-బీ వీసాల విషయంలో 12 కంపెనీలపై అనర్హత వేటు పడింది. అమెరికా కార్మిక శాఖ(డీవోఎల్) ఈ మేరకు తన వెబ్సైట్లో జాబితాను ప్రచురించింది. ఆయా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘనలకు పాల్పడ్డ, తప్పుడు సమాచారాన్ని అందజేసిన కేటగిరీల్లో ఉన్నాయని పేర్కొంది. వీటిల్లో రెడ్డి రామేశ్వర్ సహా.. తెలుగు వారికి చెందిన పలు కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది.