‘ఇన్‌స్టా’ చాలెంజ్‌

ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST

సామాజిక మాధ్యమాల్లో ‘చాలెంజ్‌’లకు ఇప్పుడు తెగ క్రేజ్‌. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ తారల వరకు ఇందులో లీనమైపోతున్నారు. ఎప్పటికప్పుడు నయా సవాళ్లు విసిరి నవతరాన్నీ ఉత్సాహపరుస్తున్నారు...

‘ఇన్‌స్టా’ చాలెంజ్‌

సామాజిక మాధ్యమాల్లో ‘చాలెంజ్‌’లకు ఇప్పుడు తెగ క్రేజ్‌. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ తారల వరకు ఇందులో లీనమైపోతున్నారు. ఎప్పటికప్పుడు నయా సవాళ్లు విసిరి నవతరాన్నీ ఉత్సాహపరుస్తున్నారు. అమితంగా ఆకర్షించిన అలాంటి ట్రెండీ చాలెంజ్‌లే ఇవి... 


‘చాలెంజ్‌’ అంటే చాలు... ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకొంటాయి. ఆ సవాలు సెలబ్రిటీల నుంచైతే..! తొడగొట్టి బరిలోకి దిగిపోమూ! విశేషమేమంటే... సామాజిక మాధ్యమాల్లో సవాళ్లకు సామాన్యులే కాదు... సెలబ్రిటీలూ సై అంటున్నారు. అలా ఇన్‌స్టాగ్రామ్‌లో పుట్టినవాటిల్లో ‘సెక్సీ బ్యాక్‌ డ్యాన్స్‌ చాలెంజ్‌, ఎమోజీ చాలెంజ్‌, ఐయామ్‌ సో ప్రెట్టీ’ వంటివెన్నో ఉన్నాయి. విక్కీ కౌశల్‌, క్రిస్సీ టైగెన్‌, డయానా పెంటీ, షాహిద్‌ కపూర్‌, మీరా కపూర్‌, సమంత, మౌనీ రాయ్‌, హినా ఖాన్‌ తదితర తారలకు చాలెంజ్‌లు స్వీకరించడం అలవాటుగా మారిపోయింది. 


విక్కీ కౌశల్‌ ‘డోన్ట్‌ రష్‌ చాలెంజ్‌’ పేరిట వదిలిన వీడియోకు 1.2 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. ‘వీడియోలు చూస్తూ సమయం వృథా చేస్తున్నాను. మరికొంత సమయం వృథా చేద్దామని ఈ వీడియో తీశాను’ అంటూ విక్కీ పోస్ట్‌ చేశారు. వైరల్‌ అయిన ఈ వీడియో స్ఫూర్తితో టాలీవుడ్‌ నటి సమంత... విక్కీ అడుగుజాడల్లోనే నడిచారు. తన కొరియోగ్రాఫర్‌తో కలిసి డ్యాన్స్‌ చాలెంజ్‌లో పాల్గొన్న సమంత... విక్కీని కోట్‌ చేస్తూ ఆ వీడియో పోస్ట్‌ చేశారు. రకుల్‌ప్రీత్‌సింగ్‌, ఉపాసన, మంచు లక్ష్మి, దియామిర్జా, లావణ్యా త్రిపాఠి తదితర ప్రముఖులు సమంత ట్యాలెంట్‌ను పొగడకుండా ఉండలేకపోయారు. పదిహేను లక్షల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. సమంతకు ఇలాంటి చాలెంజ్‌లు కొత్తేమీ కాదు. గతంలో కూడా ‘ఐయామ్‌ సో ప్రెట్టీ చాలెంజ్‌’లో కూడా తన సత్తా చూపించారు. ఇక బాలీవుడ్‌ తారలు డయానా పెంటీ, మౌనీరాయ్‌లూ ఈ చాలెంజ్‌ను స్వీకరించారు. హినా ఖాన్‌, రణవీర్‌సింగ్‌, దీపికా పదుకొనేలు ‘బస్‌ ఇట్‌ చాలెంజ్‌, సిల్హౌట్‌ చాలెంజ్‌’ వంటి చాలెంజ్‌ల్లో పాల్గొన్నారు. షాహిద్‌ కపూర్‌, మిరా రాజ్‌పుత్‌ల జంట ‘సెంటర్‌ ఆఫ్‌ గ్రావిటీ, ఎమోజీ చాలెంజ్‌, సెక్సీ బ్యాక్‌ డ్యాన్స్‌ చాలెంజ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వర్సెస్‌ రియాలిటీ’ల్లో అదరగొడుతున్నారు. ఇంకా ఎందరో సెలబ్రిటీలు సమయం చిక్కినప్పుడల్లా ‘చాలెంజ్‌’ అంటూ నెట్టింట అభిమానులకు వినోదాల విందు పంచుతున్నారు. 

Updated Date - 2021-05-05T05:30:00+05:30 IST