ట్రెండింగ్: సంతానం లేని మహిళలకు ధైర్యం ఇచ్చే వీడియో

ABN , First Publish Date - 2021-02-26T22:03:10+05:30 IST

మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఓ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన యాడ్ కాంపెయిన్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రముఖ నటి మోనా సింగ్‌ ఈ యాడ్లో లత అనే లీడ్ రోల్..

ట్రెండింగ్: సంతానం లేని మహిళలకు ధైర్యం ఇచ్చే వీడియో

మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఓ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన యాడ్ కాంపెయిన్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రముఖ నటి మోనా సింగ్‌ ఈ యాడ్లో లత అనే లీడ్ రోల్ చేశారు. ఇంటికి పెద్దకోడలిగా ఉన్న లత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఇంటి బాధ్యతలన్నీ చూస్తుంటుంది. తనకంటే చిన్నదైన తోడికోడలు త్వరలోనే బిడ్డకు జన్మనిస్తుండటం చూసి పిల్లలు లేని లత.. మనసులో బాధ మెలిపెడుతున్నా గుండెల్లోనే దాచుకుని కుటుంబంతో ఆనందంగా గడుపుతుంటుంది. ఒక రోజు పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలని కుటుంబసభ్యులు ఆమెను అడిగేసరికి మరింత ఉద్వేగానికి గురవుతుంది. కన్నీళ్లు కనిపించకుండా అక్కడి నుంచి లేచివెళ్లిపోతుంటే తోడికోడలు లేచి.. నా బిడ్డకు అక్క పేరే పెట్టుకుంటానని చెప్పడం ఈ వీడియోలో ట్విస్ట్.


 ‘ఇంటికి పెద్ద కోడలిగా.. ఉపాధ్యాయురాలిగా.. ఎన్నో బాధ్యతలు చేపడుతున్నావు. కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉన్నావు. నీ చుట్టూ ఉన్నవాళ్లందరికీ ఆనందాన్ని పంచుతావు. అందుకే నా కూతురికి నీ పేరే పెడతాను. అని తోడికోడలు చెప్పడంతో ఆమె ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. సంతానం లేని మహిళలకు ఆత్మస్థైర్యం కల్పించేందుకు ఉద్దేశించిన ఈ యాడ్ ఫిల్మ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికి 20 లక్షల మంది దీనిని వీక్షించారు. నెటిజన్లు కూడా తమకు కన్నీళ్లు అగడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.Updated Date - 2021-02-26T22:03:10+05:30 IST