చర్మం బిగుతుగా ఉండాలంటే...
ABN , First Publish Date - 2021-03-24T07:48:52+05:30 IST
యవ్వనంగా కనిపించాలంటే చర్మం బిగుతుగా ఉండాలి. మరి అలాంటి చర్మం సొంతం కావాలంటే ఇదిగో ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.

యవ్వనంగా కనిపించాలంటే చర్మం బిగుతుగా ఉండాలి. మరి అలాంటి చర్మం సొంతం కావాలంటే ఇదిగో ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.
కీర రసం చర్మానికి కావలసిన తేమను అందించి మృదువుగా, తాజాగా ఉంచుతుంది.
ఆముదం నూనె చర్మ సమస్యలను నివారిస్తుంది. రాత్రి పడుకోబోయే ముందు ముఖానికి ఈ నూనెను రాసుకుంటే చర్మం సున్నితంగా, బిగుతుగా తయారవుతుంది.
అరటిపండు గుజ్జు రాసుకుంటే ముఖం, మెడ దగ్గరి చర్మం బిగుతుగా మారుతుంది.
సాగిన చర్మంపై పెరుగు ఫేస్ మాస్కు రాసుకుంటే చర్మం బిగుతుగా మారడంతో పాటు మెరుపును సంతరించుకుంటుంది.
రోజువారి మెనూలో క్యాబేజీ ఉండేలా చూసుకోవాలి. క్యాబేజీలోని ఎ, బి, సి, ఇ విటమిన్లు చర్మం సాగడాన్ని నివారిస్తాయి.
బాదం నూనెలోని విటమిన్ ఇ చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది. అలాగే చర్మం సాగే గుణాన్ని తగ్గిస్తుంది. దాంతో చర్మం బిగుతుగా ఉండేలా చేస్తుంది.
గుడ్డు తెల్లసొనలోని పోషకాలు చర్మం ఎలాస్టిసిటీని పెంచుతాయి. చర్మాన్ని బిగుతుగా చేస్తాయి.
అవకాడో కూడా చర్మం సాగకుండా చూస్తుంది.
బొప్పాయి పండులోని ఎంజైములు చర్మం సాగే గుణాన్ని నియంత్రిస్తాయి.