వంట గదిని సులభంగా శుభ్రం చేసే చిట్కా
ABN , First Publish Date - 2021-02-01T05:43:01+05:30 IST
రెండు చెంచాల వెనిగర్‌లో కొన్ని వేడినీళ్లతో పాటు ఒక చెంచా ఉప్పు కలిపి దాంతో వంటగదిని తుడిస్తే వంట తాలుకు నూనె, కూరల మొండి మరకలు ఇట్టే పోతాయి.

రెండు చెంచాల వెనిగర్‌లో కొన్ని వేడినీళ్లతో పాటు ఒక చెంచా ఉప్పు కలిపి దాంతో వంటగదిని తుడిస్తే వంట తాలుకు నూనె, కూరల మొండి మరకలు ఇట్టే పోతాయి.
మరమరాలు కరకరలాడాలంటే గంటసేపు ఎండలో ఆరబెట్టాలి.
చల్లగాలి కోసం కూలర్ వాడేవాళ్లు అందులో కొద్దిగా రోజ్‌వాటర్ వేస్తే గదంతా పరిమళాలు వెదజల్లుతుంది.
దళసరిగా ఉన్న పాలమీగడను నెయ్యిలా తయారుచేసేటప్పుడు అందులో కొద్దిగా నీళ్లు చల్లితే ఆ నెయ్యి తొందరగా పేరుకుపోదు.
పూరీలు తెల్లగా ఉండాలంటే వేగించే నూనెలో నాలుగైదు జామాకులు వేయాలి.
సగ్గుబియ్యాన్ని కొద్దిసేపు నీటిలో నానబెట్టి ఉడికించేటప్పుడు అందులో నెయ్యి వేస్తే ఆ గింజలు అతుక్కుపోవు.
బెండకాయలు వేగించేటప్పుడు జిగురుగా ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే కడాయిలో బెండకాయ ముక్కలు వేసిన వెంటనే అందులో కాస్త మజ్జిగ వేసి కలిపితే జిగురు బాధ ఉండదు.
వంకాయ ముక్కలు కోయగానే నల్లబడిపోతాయి. అలాకాకుండా ఉండాలంటే కూరలో ఒక స్పూను పాలు వేసి ఉడికిస్తే ముక్కలు నల్లబడవు. కూర రుచిగా కూడా ఉంటుంది.
పుదీనా పచ్చడి చేసేటప్పుడు కొద్దిగా పెరుగును కూడా కలిపితే దాని రంగు, రుచీ రెండూ బాగుంటాయి.