ద విన్నర్‌ ఈజ్‌... చికెన్‌ బిర్యానీ!

ABN , First Publish Date - 2021-12-25T05:30:00+05:30 IST

ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీలో ఎక్కువ మంది ఆర్డర్‌ చేస్తున్న డిష్‌ ఏంటో తెలుసా? చికెన్‌ బిర్యానీ. వరుసగా ఆరు..

ద విన్నర్‌ ఈజ్‌... చికెన్‌ బిర్యానీ!

ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీలో ఎక్కువ మంది ఆర్డర్‌ చేస్తున్న డిష్‌ ఏంటో తెలుసా? చికెన్‌ బిర్యానీ. వరుసగా ఆరు సంవత్సరాలు చికెన్‌ బిర్యానీయే ఆర్డర్లలో టాప్‌ పొజిషన్‌లో నిలుస్తోంది. ఈ ఏడాది స్విగ్గీకి వచ్చిన చికెన్‌ బిర్యానీ ఆర్డర్ల సంఖ్య 6 కోట్లు. ఒక నిమిషానికి 115 చికెన్‌ బిర్యానీలు ఆర్డర్లు వచ్చాయి. అంటే సగటున సెకనుకు రెండు బిర్యానీలు ఆర్డర్‌ చేస్తున్నారు. దీనిబట్టి బిర్యానీ పట్ల మన వాళ్ల మక్కువను అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, చెన్నై, లక్నో నగరాల్లో చికెన్‌ బిర్యానీయే టాప్‌లో ఉంటోంది.  


ఏ నగరంలో ఏది?

హైదరాబాదీలు చికెన్‌ బిర్యానీని ఇష్టపడితే కొన్ని నగరాల్లో మాత్రం వెజ్‌ వంటకాలే టాప్‌ ప్లేస్‌లో ఉంటున్నాయి. ముంబయిలో ఎక్కువ మంది ఇష్టపడుతున్న దాల్‌ కిచిడీ. జైపూర్‌ ప్రజలు దాల్‌ ఫ్రై, ఢిల్లీ వాసులు దాల్‌ మఖానీ తినడానికి ఆసక్తి చూపారు. ఇక బెంగళూరు ప్రజలు మసాల దోశకు ఎక్కువ ఆర్డర్‌ చేశారు. 


స్వీట్లలో ఇదే టాప్‌!

మనవాళ్లు డెజర్ట్‌గా బ్రౌనీ లేక ఐస్‌క్రీమ్‌నో ఇష్టపడటం లేదు. గులాబ్‌జామ్‌ కావాలని అడుగుతున్నారు. ఈ ఏడాది 21లక్షల ఆర్డర్లతో గులాబ్‌జామ్‌ టాప్‌ ప్లేస్‌లో నిలిస్తే రస్‌మలాయి 13లక్షల ఆర్డర్లతో రెండో స్థానంలో నిలిచింది.

Updated Date - 2021-12-25T05:30:00+05:30 IST