మిథాలీకి నాకు సారూప్యత ఉంది

ABN , First Publish Date - 2021-01-31T05:37:35+05:30 IST

‘‘ఒత్తిడి నాలోని అత్యుత్తమ ప్రతిభను వెలికి తెస్తుందని భావిస్తాను’’ అంటున్నారు కథానాయిక తాప్సీ. ఆమె అథ్లెట్‌గా నటిస్తోన్న ‘రష్మీరాకెట్‌’

మిథాలీకి నాకు  సారూప్యత ఉంది

‘‘ఒత్తిడి నాలోని అత్యుత్తమ ప్రతిభను వెలికి తెస్తుందని భావిస్తాను’’ అంటున్నారు కథానాయిక తాప్సీ. ఆమె అథ్లెట్‌గా నటిస్తోన్న ‘రష్మీరాకెట్‌’ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకొన్నారు. విరామం తీసుకోకుండా తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నారు తాప్సీ. మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ ‘శభాష్‌ మిథూ’ షూటింగ్‌ ప్రారంభించేందుకు తాప్సీ సన్నద్ధమవుతున్నారు. తెరపై ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా కనిపించేందుకు క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.


తాప్సీ మాట్లాడుతూ‘‘ క్రికెట్‌కు వీరాభిమానినే అయినా ఇప్పటిదాకా ఆటను చూడటమే తప్ప నేను బ్యాట్‌ పట్టింది లేదు. కానీ ఈ చిత్రంలో క్రికెటర్‌ పాత్ర పోషించటాన్ని సవాల్‌గా స్వీకరించాను. ఇది నా పైన ఒత్తిడి పెంచుతోంది. అయినా ఒత్తిడిలోనే మనలోని నిజమైన ప్రతిభ వెలికి వస్తుందని భావిస్తున్నాను.   అంతేకాదు ఇది మిథాలీకి నాకు ఉన్న సారూప్యత కూడా’’ అని చెప్పారు. ఈ చిత్రానికి రాహుల్‌ డోలకియా దర్శకత్వం వహిస్తున్నారు.

Updated Date - 2021-01-31T05:37:35+05:30 IST