వేసవిలో ఆరోగ్యం కాపాడుకోండిలా...
ABN , First Publish Date - 2021-05-08T05:30:00+05:30 IST
మండే ఎండలతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటి బారిన పడకుండా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంతో పాటు శారీరక శ్రమ విషయంలో కూడా తగిన సూచనలు పాటించాలంటున్నారు వైద్య నిపుణులు...

మండే ఎండలతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటి బారిన పడకుండా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంతో పాటు శారీరక శ్రమ విషయంలో కూడా తగిన సూచనలు పాటించాలంటున్నారు వైద్య నిపుణులు...
వేసవిలో ప్రధాన సమస్య డీహైడ్రేషన్. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే రోజుకు కనీసం రెండు లీటర్లు నీళ్లు తాగాలి. వేడి ఎక్కువగా ఉన్న సమయాల్లో పదిహేను ఇరవై నిమిషాకొకసారి కొద్ది కొద్దిగా నీళ్లు తీసుకోవడం మంచిది.
ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో శారీరక శ్రమ సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడమే మేలు. వేసవిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య జిమ్, వ్యాయామాలు చేయడం ఆరోగ్యానికి చేటు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం వంటివి ఉదయంపూట ముగిస్తే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.
ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే సన్‌స్ర్కీన్ లోషన్ రాసుకోండి. వేడి వాతావరణంలో కూడా చర్మం మృదుత్వాన్ని ఇది కాపాడుతుంది. పలు చర్మ సమస్యల నుంచి రక్షిస్తుంది.
ుఽ పగటి వేళ గుమ్మం దాటాల్సి వస్తే గొడుగు తీసుకువెళ్లండి. లేదంటే కనీసం టోపీ ఎప్పుడూ మీతో ఉంచుకోండి.
క్రమం తప్పకుండా పండ్ల రసాలు, కీర, పుచ్చకాయ ముక్కల వంటివి తీసుకోండి.
ముఖ్యంగా పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. మసాలాలూ, వేపుళ్లు, ఇతర ఆయిల్ ఫుడ్స్‌కు దూరంగా ఉండడం ఉత్తమం.
శరీరం పదే పదే అలసిపోయినట్లు అనిపించినా, తలనొప్పి, ఒళ్లునొప్పులు వచ్చినా, కళ్లు తిరుగుతున్నట్లున్నా వెంటనే నీళ్లు, పండ్ల రసాల వంటివి తీసుకోండి. తరువాత వైద్యుడిని సంప్రతించండి.