వాళ్లనే తేల్చుకోమన్నాను

ABN , First Publish Date - 2021-06-13T05:30:00+05:30 IST

హీరోయిన్‌గా ప్రియమణి పయనం ఆసక్తికరం. తమిళ చిత్రాలతో ప్రారంభించి, మలయాళరంగానికి వెళ్లి, తెలుగులో హీరోయిన్‌గా స్థిరపడ్డారు. అంతటితో ఆగలేదు. మణిరత్నం రూపొందించిన హిందీ చిత్రం

వాళ్లనే తేల్చుకోమన్నాను

హీరోయిన్‌గా ప్రియమణి పయనం ఆసక్తికరం. తమిళ చిత్రాలతో ప్రారంభించి, మలయాళరంగానికి వెళ్లి, తెలుగులో హీరోయిన్‌గా స్థిరపడ్డారు. అంతటితో ఆగలేదు. మణిరత్నం  రూపొందించిన హిందీ చిత్రం ‘రావణ్‌’తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఇక అప్పటినుంచి భాషతో పట్టింపు లేకుండా అన్ని సినిమాల్లోనూ నటిస్తున్నారు. పెళ్లయిన తర్వాత ప్రియమణి  కెరీర్‌ కాస్త డల్‌ అయింది అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా కొన్ని సినిమాలు వచ్చి మళ్లీ ఆమెను బిజీ చేశాయి. ముఖ్యంగా ‘ఫ్యామిలీ మాన్‌ ’వెబ్‌ సిరీస్‌ రెండు భాగాల్లోనూ ప్రియమణి నటన ప్రతి ఒక్కరినీ అలరించింది. అలాగే శరీరాకృతిని ఆమె కాపాడుకుంటున్న తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.


ఈ విషయం గురించి ప్రియమణి మాట్లాడుతూ ‘నిజం చెప్పాలంటే ఒకానొక దశలో నా బరువు 65 కిలోలు దాటేసింది. ఇప్పుడు నేను కనిపిస్తున్న దానికంటే లావుగా ఉండేదాన్ని. అప్పుడు చాలా మంది నన్ను చూసి ‘మీరు లావుగా కనిపిస్తున్నారు మేడం. కొంచెం తగ్గండి’ అనేవారు. సరికదాని డైటింగ్‌ అదీ చేసి కాస్త సన్నబడేసరికి ‘మీరు సన్నగా కనిపిస్తున్నారెందుకు? కొంచెం లావు పెరగండి మేడమ్‌’ అంటున్నారు. నేను లావుగా ఉండాలో, సన్నబడాలో వాళ్లనే తేల్చుకోమని చెబుతున్నాను’ అని నవ్వుతూ చెప్పారు.


ప్రియమణి తెలుగులో ప్రస్తుతం వెంకటేశ్‌ సరసన ‘నారప్ప’ చిత్రంలోనూ, ‘విరాటపర్వం’లో భారతక్కగా నక్సలైట్‌ పాత్రలోనూ నటిస్తున్నారు.

Read more