కొత్త ఇంట్లోకి పూజాహెగ్డే
ABN , First Publish Date - 2021-02-21T06:56:27+05:30 IST
హీరోయిన్ పూజాహెగ్డే తన కలల గృహాన్ని సొంతం చేసుకున్నారు. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం బాంద్రాలో సముద్రానికి ఎదురుగా ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను ఆమె కొన్నారు...
హీరోయిన్ పూజాహెగ్డే తన కలల గృహాన్ని సొంతం చేసుకున్నారు. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం బాంద్రాలో సముద్రానికి ఎదురుగా ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను ఆమె కొన్నారు. ప్రస్తుతం పూజా తల్లితండ్రులతో ఉంటోన్న ఇంటికి దగ్గరగా ఈ అపార్ట్మెంట్ ఉంటుంది.
పలు సినిమాలతో బిజీగా ఉన్నా ఇంటి అలంకరణ కోసం సమయం వెచ్చించి అందంగా తీర్చిదిద్దారు. పూజ బాలీవుడ్లో రణ్‌వీర్‌సింగ్ సరసన ‘సర్కస్’, సల్మాన్‌ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దివాలీ’ చిత్రాల్లో నటిస్తున్నారు.