గులాబీ రంగు అధరాల కోసం...!

ABN , First Publish Date - 2021-01-31T05:30:00+05:30 IST

పెదవులు గులాబీరంగులో ఉంటే ఆ అందమే వేరు. మరి అధరాలు గులాబీరంగులోకి మారాలంటే ఈ చిట్కాలు ఫాలో అయిపోండి...

గులాబీ రంగు అధరాల కోసం...!

పెదవులు గులాబీరంగులో ఉంటే ఆ అందమే వేరు. మరి అధరాలు గులాబీరంగులోకి మారాలంటే  ఈ చిట్కాలు ఫాలో అయిపోండి... 


బాదం నూనె, వ్యాజెలైన్‌, కోకో బటర్‌, కొబ్బరి నూనె వంటి వాటిని పెదవులపై నిత్యం రాసుకుంటే వాటి నల్లదనం పోయి గులాబీరంగులోకి మారతాయి.

రోజుకు రెండుసార్లు అలొవెరా జెల్‌ను రాస్తే కొద్ది రోజుల్లోనే పెదవులు మెరుపులు చిందిస్తాయి.

విటమిన్‌-ఇ ట్యాబ్లెట్లు కూడా పెదవుల నలుపుదనాన్ని పోగొడతాయి. ఈ ట్యాబ్లెట్లను మెత్తని పొడిలా చేసి అందులో కొద్దిగా నీళ్లుపోసి లిక్విడ్‌లా చేసుకోవాలి. ఆ లిక్విడ్‌ని పెదవులపై రోజుకు రెండుసార్లు రాయాలి. అధరాలు గులాబి రంగులోకి వచ్చే వరకూ ఈ లిక్విడ్‌ని రాసుకోవాలి. 

రెండు టేబుల్‌స్పూన్ల ఎక్స్‌ట్రావర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్‌, షీ బటర్‌ అర టేబుల్‌స్పూను, ఒక టేబుల్‌స్పూన్‌ గ్రేటెడ్‌ బీస్‌ వ్యాక్స్‌లను కొద్ది సెకన్లపాటు వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తరువాత అందులో పది చుక్కల విటమిన్‌-ఇ ఆయిల్‌, ఏదైనా ఎసెన్షియల్‌ ఆయిల్‌ పది చుక్కలు వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని పెదవులకు రాసుకుంటే మృదువుగా ఉంటాయి. 

పసుపు, పాలు కలిపిన పేస్టును పెదాలకు రాసుకుని కొంచెంసేపు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకొని లిప్‌బామ్‌ రాసుకోవాలి. ఇలా చేస్తే పెదవులు గులాబీ రంగులోకి మారతాయి. 

నిమ్మరసంలో బ్లీచింగ్‌ గుణాలు ఎక్కువ. అందుకే కాస్త నిమ్మరసంలో చక్కెర వేసి స్క్రబ్‌లా చేసుకుని పెదవులపై రాసుకుని కాసేపటి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేయడం వల్ల పెదవులు నునుపుదేలుతాయి. నిమ్మరసం ఎక్కువైతే పెదాలు పొడిబారిపోయే అవకాశం ఉంది. అయితే స్క్రబ్‌లో తేనె లేదా గ్లిజరిన్‌ చేరిస్తే ఆ సమస్య తలెత్తదు. 

Updated Date - 2021-01-31T05:30:00+05:30 IST