పార్టీల కాలం.. సమకాలీనం...

ABN , First Publish Date - 2021-12-08T05:30:00+05:30 IST

సంవత్సరాంతం వచ్చింది... పార్టీల కాలమూ మొదలైంది. ఎలాగూ ఇది వివాహ వేడుకల సీజన్‌ కూడా.....

పార్టీల కాలం.. సమకాలీనం...

సంవత్సరాంతం వచ్చింది... పార్టీల కాలమూ మొదలైంది. ఎలాగూ ఇది వివాహ వేడుకల సీజన్‌ కూడా ! ఈ పార్టీల వేళ వైవిధ్యంగా ఫ్యాషన్‌లను చూపాలంటే సమకాలీనతను అనుసరిస్తూనే, సంప్రదాయాలనూ వైవిధ్యంగా చూపొచ్చంటున్నారు డిజైనర్‌ సుష్మిత. ఇండో-వెస్ట్రన్‌ వేర్‌కు సుప్రసిద్ధమైన ఈమె, సంప్రదాయ చీరకే వైవిధ్యమైన సొబగులద్దడంతో పాటుగా వార్డ్‌ రోబ్‌ క్లాసిక్‌ గరారాలోనూ వైవిధ్యత చూపుతూ ఈ సీజన్‌లో ఎలాంటి ఫ్యాషన్‌లను చూపొచ్చనే అంశమై ఇలా చెప్పుకొచ్చారు...


ఈ వివాహ సీజన్‌లో క్లాసిక్‌ఫ్యూజన్‌ చీరతో వైభవం జోడించవచ్చు. ఈ ఆరెంజ్‌ చెకర్డ్‌ ప్రింట్‌ శారీని హ్యాండ్‌ వర్క్‌ బ్లౌజ్‌ తో కలిపి ధరిస్తే వెడ్డింగ్‌ పార్టీలో మీరే ప్రత్యేక ఆకర్షణ. చీరపై చిన్నగా హ్యాండ్‌వర్క్‌ బూటీస్‌ కూడా ఉండటంతో ఇది ఎన్నటికీ కాలాతీత ఫ్యాషన్‌గానే కొనసాగుతుంది.
                  


ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న గరారా సెట్‌ ఇది.  సరిగ్గా చెప్పాలంటే వార్డ్‌రోబ్‌ క్లాసిక్‌ ఇది. సాధారణ ప్యాంట్స్‌ లేదంటే లెగ్గింగ్స్‌ నుంచి గరారా వరకూ మీ లుక్‌ ఇన్‌స్టెంట్‌గా మారిపోతుంది. ఈ గరారాను బేబీ పింక్‌ కుర్తాతో జత చేయడం వల్ల సరికొత్త అందం కనిపిస్తుంది. కుర్తాపై డిటైల్‌ వర్క్‌ చూడగానే ఆకట్టుకునే రీతిలో ఉంటే దీన్ని మించి దుపట్టా మరింత అందం అందిస్తుంది. ఇకపార్టీల్లో సరదాగా కాలు కదపడానికి కూడా  సౌకర్యంగా ఉంటుంది.వెడ్డింగ్‌ సీజన్‌ కలర్‌ ఇది ! సీ గ్రీన్‌ కలర్‌లో ఉన్న ఫ్లోర్‌ లెంగ్త్‌ గౌన్‌  ఇది. తక్కువలో ఎక్కువ అందం చూపేలా హ్యాండ్‌ వర్క్‌ దీనిలో ప్రత్యేకత. ఆ వర్కే ఈ గౌన్‌ను ఈ వెడ్డింగ్‌ సీజన్‌లో కంప్లీట్‌ ప్యాకేజీగానూ మారుస్తుంది. వధువుకు కాదు కానీ వారి ఫ్రెండ్స్‌ ఈ డ్రెస్‌లో మురిసిపోవచ్చు.


ఫ్యూజన్‌/పార్టీవేర్‌ గౌన్‌ ఇది. హ్యాండ్‌క్రాఫ్ట్‌ డిటైలింగ్‌ ఈ గౌన్‌లో  చూడొచ్చు. ఒకవేళ  మీరు మీ డ్రెస్‌కు నాటకీయత జోడించడంతో పాటుగా నూతన తరపు లేదంటే కాక్‌టైల్‌/వెడ్డింగ్‌ సంబరాలలో హాజరుకావాలనుకుంటే ఇది ఖచ్చితంగా సరిపోతుంది. ఈ బ్లాక్‌ ఒన్‌ షోల్డర్‌ గౌన్‌, సీక్విన్‌ హ్యాండ్‌వర్క్‌తో ఉండటం వల్ల శైలి పరంగా సౌకర్యంగానూ ఉంటుంది.


ఈ అనార్కలీతో బంధనీ కంటెంపరరీ లుక్‌ ఇవ్వొచ్చు. ఈ ఔట్‌ఫిట్‌కు మరింత అందం వచ్చిందంటే  అది దుపట్టాతోనే ! దీనిలో చూపులను తిప్పుకోనీయకుండా చేసేది నైట్‌ ప్లీటెడ్‌  ఘెరా, చుడీస్లీవ్స్‌. ఇవి ఈ ఔట్‌ఫిట్‌కు మరింత అందం అందిస్తాయి.                                                                         కర్టెసీ:  డిజైనర్‌ సుష్మిత కసత్‌

                                                                          బొటిక్‌: సుష్‌ఎటైర్‌, బషీర్‌బాగ్‌.

Updated Date - 2021-12-08T05:30:00+05:30 IST