పొగడ్తలకు పడిపోతున్నారా?

ABN , First Publish Date - 2021-05-31T06:14:24+05:30 IST

పొగడ్తలు... వీటికి పిల్లలే కాదు, కొన్నిసార్లు పెద్దలు కూడా పడిపోతుంటారు. అది మానవుల్లో ఉండే సహజమైన స్పందన. అయితే కొంతమంది పిల్లలకు వారు చేసే ప్రతి పనికీ శభాష్‌ అనిపిం

పొగడ్తలకు పడిపోతున్నారా?

పొగడ్తలు... వీటికి పిల్లలే కాదు, కొన్నిసార్లు పెద్దలు కూడా పడిపోతుంటారు. అది మానవుల్లో ఉండే సహజమైన స్పందన. అయితే కొంతమంది పిల్లలకు వారు చేసే ప్రతి పనికీ శభాష్‌ అనిపించుకోకపోతే నిద్దర పట్టదు. పిల్లలను పొగిడితే తప్పేమీ లేదు కానీ... అది శృతిమించితేనే ఇబ్బంది అంటున్నారు నిపుణులు. 


చాలామంది తల్లితండ్రుల ఫిర్యాదు ఏంటంటే... తమ పిల్లలు పొగడ్తలను తెగ ఇష్టపడుతున్నారని! రాను  రాను వాటికి అలవాటు పడిపోయి... తామే గొప్ప అనే భావంలోకి వెళుతున్నారనేది వాళ్ల ఆందోళన. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది... ఆ భావన పిల్లల్లో సాధారణం. అలాగే ఆరోగ్యకరం కూడా! 


ప్రముఖ మనస్తత్వవేత్తల ప్రకారం... పిల్లలు ఎదిగే క్రమంలో తమపై ఎదుటివారు వ్యక్త పరిచే అభిప్రాయాలు, స్వీయభావం తరువాత ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. అయితే ఏదైనా సరే అతి అనర్థానికి దారి తీస్తుంది. కనుక పిల్లల్లో ఆత్మస్తుతి అధికమవడానికి మూలం ఏమిటన్నది వెతికి పట్టుకోవాలి. అందుకు కారణాలు పాజిటివ్‌ కావచ్చు... నెగటివ్‌ కూడా కావచ్చు. కొందరు వేరొకరిని అనుకరిస్తుంటారు. మరికొందరు గెలుపు తప్ప మరేదీ గొప్పది కాదని భావించే వాతావరణంలో పెరిగి ఉండవచ్చు. ఏదిఏమైనా సున్నితమైన వారి మనసు గాయపడకుండా వాస్తవికత అర్థమయ్యేలా చేయడం తల్లితండ్రుల బాధ్యత.

Updated Date - 2021-05-31T06:14:24+05:30 IST