ఆత్మావలోకనం చేసుకుందాం

ABN , First Publish Date - 2021-12-31T05:42:41+05:30 IST

శ్వాసుల జీవితంలో ప్రతి రోజూ ఒక కొత్త ప్రారంభం. నూతన సంవత్సరం కూడా అంతే. కాలాన్ని... అది నిమిషమైనా, గంటైనా, రోజైనా, ఏడాది అయినా... దేవుడికి మరింత దగ్గర కావడానికి వినియోగించుకోవడం విశ్వాసుల కర్తవ్యం కావాలి.

ఆత్మావలోకనం చేసుకుందాం

విశ్వాసుల జీవితంలో ప్రతి రోజూ ఒక కొత్త ప్రారంభం. నూతన సంవత్సరం కూడా అంతే. కాలాన్ని... అది నిమిషమైనా, గంటైనా, రోజైనా, ఏడాది అయినా... దేవుడికి మరింత దగ్గర కావడానికి వినియోగించుకోవడం విశ్వాసుల కర్తవ్యం కావాలి. ఈ విధంగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే... ఆత్మావలోకనం చేసుకోవాలి. గడచిపోయిన రోజుల్లో... ‘దైవానికి దగ్గర కావడం కోసం మనం ఏ కార్యాలు చేయాలనుకున్నాం, ఏవి చేశాం, వేటిని వదిలేశాం, దానికి కారణాలేమిటి?’ అనే విషయాలు ఆలోచించాలి. 


ప్రతి రోజూ మనకు ఒక కొత్త అవకాశాన్ని అందిస్తుంది. చేజారిపోయిన నిన్నటి గురించి చింతించకుండా... చేతికి అందిరాబోతున్న కొత్త రోజును... విశ్వాసిగా మరింత పరిపూర్ణం ఎలా చేసుకోవాలో ఆలోచించాలి. మనం గడిపే ప్రతి రోజూ దేవుడి పట్ల మన ఘనమైన విశ్వాసానికి సాక్ష్యంగా నిలుస్తుందని గుర్తుంచుకోవాలి. అదే విధంగా మనం చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందాలి. క్షమామూర్తి అయిన దేవుడు మన పశ్చాత్తాపాన్ని గుర్తిస్తాడు. మనల్ని మన్నిస్తాడు. 


అలాగే మన దైవంపై మన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. నిత్యం పవిత్ర గ్రంథాలను చదవాలనీ, వీలైనప్పుడల్లా ప్రార్థనా మందిరాలకు వెళ్ళాలనీ, మంచి పనులు చేయాలనీ మనలో చాలామంది అనుకుంటాం. కానీ ఏవో సాకులతో వాటిని వాయిదా వేస్తాం. గడచిపోయిన రోజుల్లో... అలాంటి వాయిదాలు ఎన్ని వేసుకున్నామో వెనక్కి తిరిగి చూసుకుందాం. కొన్ని గంటల్లో వస్తున్న మరో ఏడాదిలోనైనా వాటిని నెరవేర్చాలనే దృఢ సంకల్పంతో... నూతన సంవత్సరంలోకి అడుగుపెడదాం.

Updated Date - 2021-12-31T05:42:41+05:30 IST